బీజేపీని దేవుడు కూడా క్షమించలేదు: బీఆర్ఎస్‌కు బూడిదేనంటూ రేవంత్ విమర్శలు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌​లోని సీఎం నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేశామని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వ పాలన నచ్చితే ఓటు వేయాలని లోక్‌​సభ ఎన్నికల్లో ప్రజలను అడిగామని తెలిపారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థులు గెలిచారని హర్షం వ్యక్తం చేశారు.

వంద రోజుల కాంగ్రెస్ పాలన తర్వాత 41 శాతం ఓట్లు కాంగ్రెస్​కు పడ్డాయని రేవంత్ తెలిపారు. అసెంబ్లీ ఓట్ల శాతం కంటే ఎక్కువగా లోక్‌​సభ ఎన్నికల్లో వచ్చాయని పేర్కొన్నారు. కాంగ్రెస్​ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. 8 ఎంపీ సీట్లు గెలిపించిన కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 2019లో 3 సీట్లు ఉంటే ఇప్పుడు ఆ మూడు కాస్త 8 ఎంపీ సీట్లుగా మారాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth reddy slams BJP and BRS for Telangana Lok Sabha Election Results

ఇక, ప్రతిపక్ష బీఆర్​ఎస్​ ఏడు సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని సీఎం రేవంత్​ రెడ్డి ఎద్దేవా చేశారు. 7 సీట్లలో బీజేపీను గెలిపించి బీఆర్​ఎస్​ నేతలు అవయవదానం చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఆర్​ఎస్​ నుంచి బలహీన అభ్యర్థులను బరిలోకి దింపి బీజేపీ నేతల గెలుపు కోసం కేసీఆర్​ కృషి చేశారని రేవంత్ ఆరోపించారు. గత ఎన్నికల్లో బీఆర్​ఎస్‌​కు​ వచ్చిన 22 ఓట్ల శాతాన్ని ఈ ఎన్నికల్లో బీజేపీకి బదిలీ చేశారని ఆరోపించారు.

2001 నుంచి 2023 వరకు సిద్దిపేటలో బీఆర్​ఎస్‌​కు మెజార్టీ వచ్చిందన్న రేవంత్ రెడ్డి.. సిద్దిపేటలో బీఆర్​ఎస్​ ఓట్లను హరీశ్​ రావు బీజేపీకి బదిలీ చేయించారని ఆరోపించారు. అందుకే బీఆర్​ఎస్​ ఓటింగ్​ 16.5 శాతానికి పడిపోయిందన్నారు. అచేతనావస్థలో బీఆర్​ఎస్​ ఉందని, ఆ పార్టీకి మిగిలింది బూడిదే అంటూ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు తమ వ్యవహారశైలిని మార్చుకోవాలని రేవంత్ హితవు పలికారు.

మరోవైపు, బీజేపీపైనా విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. మోడీ కాలం చెల్లిందని ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో మోడీ గ్యారంటీని దేశ ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ప్రధాని పదవికి తక్షణమే మోడీ రాజీనామా చేయాలన్నారు. మోడీ రాజీనామా చేయాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేస్తుందన్నారు సీఎం రేవంత్. రాముడి పేరుతో రాజకీయం చేసిన బీజేపీని.. ఆ దేవుడు కూడా క్షమించలేదంటూ విమర్శించారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ వెళ్తారా?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు ఓటములకు తానే బాధ్యుడినన్న రేవంత్.. తన జిల్లా అయిన మహబూబ్​‌నగర్‌​లో పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే సమస్యలు పరిష్కరించుకుంటామని తాను గతంలోనే చెప్పానన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు. మరోవైపు, ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+