Hyderabad: సిటీ జనులకు మరో గుడ్‌న్యూస్
హైదరాబాద్ నగర వాసులకు మరో శుభవార్త అందింది. గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన ఫ్లైఓవర్లు ఒక్కొక్కటీ అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్ఆర్డీపీ ద్వారా 42 పనులలో ఇప్పటి వరకు 36 పనులు పూర్తయ్యాయి. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు చేపట్టిన ఆరు లేన్ల అతిపెద్ద ఫ్లైఓవర్‌గా అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లై ఓవర్‌ను తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి జనవరి 6న ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ నగరంలో పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత రెండో అతిపెద్ద ఫ్లైఓవర్‌గా నిలుస్తుంది. మొత్తంగా 23వ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. రూ.736 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 4 కిలోమీటర్లకుపైగా పొడవు గల 6 లేన్ల ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ప్రధాన ఫ్లైఓవర్ పనులు పూర్తి కావడంతో ముఖ్యమంత్రి జనవరి 6 సోమవారం ప్రారంభించనున్నారు. ఇంతకు ముందు బైరమల్‌గూడ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించిన విషయం తెలిసిందే.

సికింద్రాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లా, హుజురాబాద్, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్ గిరి వాసులకు శంషాబాద్ విమానాశ్రయానికి వరకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సిగ్నల్ ఫ్రీ రవాణాకు వెసులుబాటు కలుగుతుంది. ఉప్పల్ నుంచి నాగోల్, కామినేని, ఎల్బీ నగర్ జంక్షన్, బైరమల్‌గూడ, (ఓవైసీ జంక్షన్) అబ్దుల్ కలాం ఫ్లైఓవర్, చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ ట్రాఫిక్ అంతరాయం లేకుండా వేగంగా నిర్దేశించిన సమయంలో చేరవలసిన గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు తక్కువ ఇంధన వాడకం, కాలుష్య రహితంగా వెళ్లేందుకు వాహనదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతేగాక, ఇమ్లిబన్ బస్ స్టేషన్ నుంచే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రవేటు బస్సులు ఇతర వాహనాలు రోజుకు 1700 నుంచి 2000 వరకు రోజు ఇతర ప్రాంతాలకు వెళుతుంటాయి. ఆరాంఘర్ నుంచి జూ పార్కు వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా నేరుగా వెళ్లేందుకు ఆరు లేన్ల అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మించారు.హైదరాబాద్ లో పీవీ నరసింహారావు ఎక్సప్రెస్‌ఫ్లై ఓవర్ 4 లైన్ల ఫ్లైఓవర్ కాగా.. ఆరాంఘర్ ఫ్లైఓవర్ ఆరు లైన్ల తో 4 కిలోమీటర్ల పైగా పొడవుతో ఎస్ఆర్డీపి ద్వారా చేపట్టిన అతిపెద్ద ఫ్లై ఓవర్‌గా నిలుస్తుంది.

ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రధాన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించడంతో వాహన దారులకు ఇబ్బందులు తొలగి పోనున్నాయి. ఈ ఫ్లైఓవర్‌కు సంబంధించిన మిగతా పనులు ఇరువైపులా ర్యాంపులు, సర్వీస్ రోడ్డు వచ్చే మార్చి, 2025 వరకు పూర్తి చేసేందుకు అవసరమైన మేరకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్డీపీ పనులు యుద్ధ ప్రాతిపదికన మొత్తం పనులు డిసెంబర్, 2025 వరకు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఎస్ఆర్డిపి ద్వారా చేపట్టిన 42 పనులలో 22 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్‌లు, 6 ఆర్ఓబీలు మరో మూడు వివిధ రకాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.












Click it and Unblock the Notifications