రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదు: వారికి సీఎం రేవంత్ హెచ్చరిక
వ్యాపారులు ధాన్యం కొనుగోళ్లలో రైతులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరలు నిర్ణయించారన్న పత్రిక కథనాలపై 'ఎక్స్'(ట్విట్టర్) వేదికగా సీఎం రేవంత్ స్పందించారు.
ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని సీఎం రేవంత్ హెచ్చరించారు. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి, రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆ అధికారికి సీఎం రేవంత్ అభినందనలు
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌ను సీఎం అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల (paddy Procurement) విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాజాగా సాగుతున్న యాసంగి ధాన్యం కొనుగోలు విషయంమై "ట్విట్టర్" వేదికగా సీఎం రేవంత్ స్పందించారు.
ఇది ఇలావుండగా, తాగు నీరు, ధాన్యం కొనుగోళ్లు, వేసవి చర్యలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనగోలు కేంద్రాల్లో తాగు నీరు, ఓఆర్ఎస్ను అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి తెలిపారు. వర్షాకాలం వచ్చేంత వరకు తాగు నీటి సరఫరాను రోజూ పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు… వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.
— Revanth Reddy (@revanth_anumula) April 11, 2024
జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటన పై సకాలంలో స్పందించి… రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై… pic.twitter.com/1XgdaIoc4t
మరోవైపు, 'మన ఊరు - మన బడి' పనులు చేపట్టేందుకు ఎన్నికల సంఘం అనుమతిచ్చిందని సీఎస్ కలెక్టర్లతో తెలిపారు. నిధులు, అనుమతులు మంజూరైనందున పాఠశాలల్లో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ప్రజలకు, సిబ్బందికి దీనిపై అవగాహన పెంచాలని సీఎస్ సూచించారు.
-
కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications