కేటీఆర్ అరెస్ట్ పై తేల్చేసిన రేవంత్..!!

ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం రేవంత్ ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్నారు. ఢిల్లీ వచ్చిన కేటీఆర్ కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. రేవంత్ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసారు. అటు కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కేటీఆర్ సైతం అరెస్ట్ కు తాను సిద్దమేనని ప్రకటించారు. ఈ సమయంలో కేటీఆర్ అరెస్ట్.. చర్యల పైన సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు.

రేవంత్ క్లారిటీ
ఈ-రేస్‌ స్కామ్​ లో బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ తప్పదని కొద్ది రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ కేసులో కేటీఆర్ విచారణకు అనుమతి కోరుతూ ఏసీబీ రాష్ట్ర గవర్నర్ అనుమతి కోరింది. స్వయంగా సీఎం రేవంత్ తాజాగా గవర్నర్ ను కలిసి ఈ కేసులో పూర్వా పరాలు వివరించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కేటీఆర్ సైతం తనను అరెస్ట్ చేయాలనకుంటే తాను సిద్దమని చెప్పుకొచ్చారు. అరెస్ట్ కు భయపడేది లేదని తేల్చి చెప్పారు. రెండు, మూడు నెలలు జైలులో ఉండి బయటకు వచ్చిన తరువాత పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పుకొచ్చారు. ఇక, తాజాగా కేటీఆర్ ఢిల్లీ పర్యటన మరింత వేడి పెంచింది.

CM Revanth Says action will initiate against KTR once Governor gives permission

కేటీఆర్ పై చర్యలు
కేంద్ర మంత్రి ఖట్టర్ ను కలిసిన కేటీఆర్ రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని.. సీఎం రేవంత్ బంధువుకు టెండర్లు అప్పగించారని ఆరోపించారు. ఇదే సమయంలో రేవంత్ సైతం ఢిల్లీకి చేరుకున్నారు. కేటీఆర్ పైన ఆరోపణలు .. చర్యల పైన స్పందించారు. గవర్నర్​ అనుమతి రాగానే​ ఈ-రేస్‌ స్కామ్​ లో కేటీఆర్ పై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ చర్యలు లేకుండా గవర్నర్‌ అనుమతి నుంచి తప్పించుకునేందుకు దిల్లీలో లాబీయింగ్ కోసం కేటీఆర్ చేరుకున్నారని రేవంత్ ఆరోపించారు. అమృత్‌ టెండర్ల విషయంలో బీఆర్‌ఎస్‌ ఆరోపణలను ముఖ్యమంత్రి ఖండించారు. రెడ్డి పేరు మీద ఉన్న వారంతా తన బంధువులు కాదని స్పష్టం చేశారు.

గవర్నర్ అనుమతిస్తే
బీజేపీ-బీఆర్‌ఎస్‌ చీకటి బంధం బయట పడుతోందని రేవంత్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఆరోపిస్తున్న సృజన్‌ రెడ్డి బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి అల్లుడే అని వివరించారు. తాజాగా వికారాబాద్ లో కలెక్టర్ పై దాడి వ్యవహారం పై రేవంత్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో ఎవరు ఉన్నా వదిలేది లేదని తేల్చి చెప్పారు. దాడులు చేసిన వారితో పాటుగా చేయించిన వారిని
వదిలేది లేదని స్పష్టం చేసారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఓటేయద్దంటే బీజేపీకి సహకరించినట్లు కాదా అని రేవంత్ ర ప్రశ్నించారు. దీంతో, ఇప్పుడు కేటీఆర్ విచారణ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. రేవంత్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+