హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు బిగ్ షాక్ - అక్కడే పరిమితం..!!
ఆటో డ్రైవర్లకు మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. మహిళల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోంది. దీంతో, తమకు డిమాండ్ తగ్గిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఈ సమస్య పైన కొంత కాలం ఆందోళన కూడా చేసారు. ఇక, ఇప్పుడు హైదరాబాద్ లో డీజిల్ ఆటోలు నడుపుతున్న డ్రైవర్లకు ప్రభుత్వ తాజా నిర్ణయం షాకింగ్ గా మారింది. డీజిల్ ఆటోలను నగర శివార్లకే పరిమితం చేయనుంది.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మూసీ నదిని పూర్తిగా మార్పు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా వస్తున్న సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తోంది. అదే విధంగా నగరంలోని జలాశయాలు, పరీవాహక ప్రాంతాల ను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వాటిని తెలిగించే బాధ్యత హైడ్రాకు అప్పగించింది. ఇప్పుడు హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది.

ప్రస్తుతం ఢిల్లో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరటంతో అక్కడ ఏర్పడుతున్న ఇబ్బందులతో కొత్త ప్రణాళికలు అమలు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో బస్సులు, ఆటోల విషయంలో కీలక నిర్ణయం తీసు కుంది. డీజిల్ వాహనాలను నగరంలో వినియోగించకూడదని నిర్ణయించింది. ప్రస్తుతం నగరం లో నడుస్తున్న బస్సుల్లో అధిక శాతం డీజిల్ తో కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో మూడు వేల కొత్త ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. అదే విధంగా డీజిల్ వాహనాలను క్రమేణా తగ్గించేలా కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నారు.
నగరంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ ఆటోల ను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించాలనేది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యమంత్రి రేవంత్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మహాలక్ష్మి పథకంతో తాము నష్టపోయామనేది ఆటో డ్రైవర్ల ఆవేదన. ఇప్పుడు ఆదాయం కోల్పో యిన ఆటో డ్రైవర్లకు డీజిల్ వాహనాలను నగర శివార్లకు తరలించాలనే ప్రతిపాదన గుది బండగా మారుతోంది. దీని పైన ఆటో యూనియన్లు ప్రభుత్వంతో చర్చించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications