ధర్నాలో సీఎం రేవంత్ - మంత్రులతో సహా..!!
ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు ధర్నాలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ధర్నా నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు..పార్లమెంట్ లో తాజా నిర్ణయాల వేళ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ తన మంత్రివర్గ సహచరులు..పార్టీ నేతలతో కలిసి శుక్రవారం ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాలో పాల్గొంటున్నారు.
పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేయనున్నారు. అలాగే పార్లమెంట్‌లో సెక్యూరిటీ లోపాలపై కూడా ఇండియా కూటమి నిరసన తెలియజేయనుంది. తాజాగా పార్లమెంట్ లో జరిగిన దాడి పైన ప్రధాని, హోం మంత్రి స్పందించాలని ఇండియా కూటమి సభ్యులు డిమాండ్ చేసారు. దీని పైన సభలో నిరసన వ్యక్తం చేసారు.

నిరసనకు దిగిన దాదాపు 40 మందికి పైగా ఎంపీలు సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ ధర్నాకు ఇండియా కూటమి నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలోనూ ఈ ధర్నాకు నిర్ణయించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిర్వహిస్తున్న కార్యక్రమం..అందునా ముఖ్యమంత్రి..మంత్రులు పాల్గొనటం ఆసక్తి కరంగా మారుతోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ధాన్యం కొనుగోలు పై కేంద్రం తీరుకు నిరసనగా నాడు సీఎం హోదాలో కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు..పార్టీ నేతలతో కలిసి ధర్నా చేసారు. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర సీఎం హోదాలో రేవంత్ ధర్నాలో పాల్గొనటం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. కాగా సాయంత్రం ఎల్బీస్టేడియంలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టమస్ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరవుతారు.












Click it and Unblock the Notifications