Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్టీ ఎమ్మెల్యేలకు రేవంత్ హెచ్చరిక - నెక్స్ట్ జరిగేది ఇదే..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన మండిపడ్డారు. కేసీఆర్ ప్రసంగంలో పస లేదన్నారు. తాము రాజకీయ ప్రతీకారాలకు దూరం అని స్పష్టం చేసారు. కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. రాహుల్ గాంధీ తో తనకు ఉన్న సత్సంబంధాల పై ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ నేతల పైన రేవంత్ సీరియస్ అయ్యారు. తాను ఎవరికైనా కమిట్‌మెంట్ ఇస్తే పూర్తి చేస్తానని చెప్పిన రేవంత్.. తన భవిష్యత్ లక్ష్యాలను స్పష్టం చేసారు.

మంచి రిలేషన్ ఉంది
పార్టీ సీనియర్ నేత జానారెడ్డితో సమావేశం అయిన సీఎం రేవంత్ మీడియాలో చిట్ చాట్ లో కీలక అంశాల పైన స్పందించారు. ఇందిరా గాంధీ తెగువను గుర్తు చేసుకున్నారు. ఒక దేశాన్ని ఓడించి చరిత్రలో నిలిచారన్నారు. వరంగల్ బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తన అక్కసు మొత్తం వెల్ల గక్కారని వ్యాఖ్యానించారు. కగార్‌పై తమ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలో ఇంధిరా గాంధీకి మించిన యోధురాలు లేరని ప్రశంసించారు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీ కే దక్కుతుందని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారని ఆరోపణలు చేశారు. తనకు ,రాహుల్ గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉందని ఉద్ఘాటించారు. తాను ఎవర్నీ నమ్మించాల్సిన అవసరం లేదన్నారు.

cm-revanth-warns-party-mlas-to-focus-on-public-issues

కేసీఆర్ పై ఆగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీం లు ఏ రాష్ట్రంలో అమల్లో లేవని తెలిపారు. ఎన్నికలకు చివరి 6 నెలలు తన పాలనపై చర్చ జరుగుతుందని అన్నారు. నిన్నటి వరంగల్ సభలో మాజీ సీఎం కేసీఆర్ తన అక్కసు మొత్తం వెళ్లగక్కారని విమర్శించారు. పిల్లగాళ్లు అని కేసీఆర్ అన్నారని... మరి వారినేందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ స్పీచ్‌లో పస లేదని విమర్శించారు. సంవత్సరన్నర నుంచి పథకాలు తీసుకొచ్చామని... ఇప్పుడు వాటంన్నింటిని సమీక్షిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను చట్టప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన నేతలను అరెస్ట్ చేయమని ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని రేవంత చెప్పుకొచ్చారు.

Take a Poll

ఎమ్మెల్యేలపై ఆగ్రహం
తాను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతానని అన్నారు.గతంలో అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పానని... అలాగే ఆయనకు ఇప్పించానని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకబడ్డామని.. స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశామన్నారు. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఉన్నపళంగా తీసేస్తే పాత విషయాలన్నీ తెలిసేది ఎలా అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే పని తీరు పై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. నియోజకవర్గాల్లో తిరగమంటే హైదరాబాద్ లో ఉంటున్నారని సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే అయ్యాక మనోడు.. మందోడు ఉండదని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందేనని రేవంత్ తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+