హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఆకస్మిక పర్యటన..!
హైదరాబాద్‌లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు లోతట్టు ప్రాంతాలు మురుగునీటితో మునిగిపోతుండగా.. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకస్మిక పర్యటన చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి అమీర్‌పేట్, బుద్ధనగర్, మైత్రీవనం, గంగూబాయి బస్తీ ప్రాంతాల్లో వరద పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
బుద్ధనగర్‌లో డ్రైనేజీ లోపాలపై ఆదేశాలు..
బుద్ధనగర్‌లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన సీఎం, కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎత్తుగా ఉండటంతో నీటి ప్రవాహం అడ్డంకులు ఎదుర్కొంటోందని గుర్తించారు. వెంటనే డ్రైనేజీ సిస్టంను స్ట్రీమ్‌లైన్ చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.

అలానే స్థానికులు గంగూబాయి బస్తీ కుంటను కొంతమంది పూడ్చివేసి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఎం ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి, ఒక ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
మరో ఇటీవల వరద నీరు నిలిచిపోయిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించిన సీఎం, స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని, నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని ఆదేశించామని చెప్పారు. ప్రజలు మ్యాన్‌హోల్స్, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని సూచించారు.
వరద పరిస్థితిపై సీఎం ఆరా
— oneindiatelugu (@oneindiatelugu) August 10, 2025
మైత్రివనం వద్ద స్థానికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి.!#RevanthReddy #HyderabadRains #TelanganaRains #HeavyRains #Ameerpet #PoliticsToday #Oneindia #OITelugu pic.twitter.com/pq3o5ciRvH












Click it and Unblock the Notifications