గవర్నర్ కు ఉన్న సోయి కేసీఆర్ కు లేదురా బాబూ.!కల్తీ ఆహారం పట్ల సీఎం స్పందించాలన్న వీహెచ్.!
హైదరాబాద్ : రాష్ట్రంలో పేరుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల హాస్టల్స్ పనిచేస్తున్నాయని వాటిలోని సౌకర్యాలు ఎంతో మృగ్యంగా ఉన్నాయన్నారు మాజీ కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంత రావు. హాస్టల్స్ లో వసతులు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కలుషిత ఆహారం తిని పిల్లలు ఆనారోగ్యం పాలవ్వడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేసారు.
వివిధ సంక్షేమ హాస్టల్లలో సరైన ఆహారం లేకపోగా, హాస్టల్ గదుల్లో ఎలుకలు తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడని దుమ్మెత్తిపోసారు. గవర్నర్ కూడా ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తుందని, గవర్నర్ ఇంత బాహాటంగా చెపుతున్నప్పటికి, ప్రభుత్వం స్పందించదా అని వీహెచ్ ప్రశ్నించారు. ప్రజాదర్బార్ పేరుతో గవర్నర్ ప్రజలను కలుస్తుందని, కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాత్రం ఎవరిని కలవరని అన్నారు. గవర్నర్ వ్యాఖ్యలలో నిరాశ, నిస్పృహ కనిపిస్తుందన్నారు వీ.హనుమంత రావు.

ప్రభుత్వానికి రాసే లేఖల వల్ల ఉపయోగం ఉండదని, కొన్ని విషయాలు తాను బయటకు చెప్పలేకపోతున్నా అని గవర్నర్ స్వయంగా అనడం చాలా బాదకరమన్నారు వీహెచ్. ఐనప్పటికి గవర్నర్ తన అసంతృప్తిని బయటకు చెప్పక పోతే ప్రజలకు ఎలా తెలుస్తుందన్నారు వీహెచ్. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును జైలులో పెడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే చెప్పుకొస్తుంటే విని చెవులు చిల్లులు పడ్డాయని వీహెచ్ ఎద్దేవా చేసారు.
చంద్రశేఖర్ రావును ఎందుకు జైళ్లో పెట్టడం లేదని, సీఎం అవినీతి నివేదికను గవర్నర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు అందివ్వోచ్చు కదా అని వీహెచ్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే, హస్టల్ ల ముందు ధర్నా చేస్తామన్నారు. పంజాగుట్టలో ఉన్న అంబేద్కర్ విగ్రహం తొలగించి మూడు సంవత్సరాలు అవుతుందని, తిరిగి మళ్ళీ అక్కడ విగ్రహం పెట్టాలని అన్ని పార్టీల ఎంపీ లకు, ఎమ్మెల్యే లకు లేఖలు రాస్తునన్నారు వీహెచ్. కొత్త పార్లమెంట్ భవనానికి అంబెడ్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని వీహెచ్ డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications