వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇద్దరికీ ప్రశాంతతలేదు, యోగా డేలో పక్కపక్కన': ఏం భాష: కేసీఆర్‌కు కిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు విద్వేషాలు వీడి అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం హితవు పలికారు.

ప్రస్తుతం వీరిద్దరికి మానసిక ప్రశాంతత కరువైందని, అందుకే ఈ నెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఇద్దరు సీఎంలు పక్కపక్కనే కూర్చుని యోగా చేయాలని సూచించారు. ఈ మేరకు ఇద్దరికీ ఆహ్వాన లేఖలు రాస్తానని తెలిపారు.

ఇటీవల నాయకులు, మంత్రులు వాడుతున్న భాష బాగా లేదని, సంయమనం పాటించాలని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌-8ను అమలు చేయాలంటున్న టీడీపీ డిమాండ్‌ గురించి ప్రస్తావించగా ఆ విషయం కేంద్ర పార్టీ చూసుకుంటుందన్నారు.

CMs must look at growth: BJP

హైదరాబాద్‌లో ప్రస్తుతం అందరికీ రక్షణ ఉందని అన్నారు. హైదరాబాదులో భద్రత లేదనడం అపోహే అని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో అన్ని వర్గాల ప్రజలకు రక్షణ ఉందని, ఇక్కడ భధ్రత లేదనటం సరికాదన్నారు.

ముస్లీంలు అధికంగా ఉండే ఇరాన్, ఇండోనేషియా, జోర్డాన్, తుర్కమెనిస్తాన్, దుబాయ్, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, షార్జాలాంటి దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంటే ఇక్కడ మజ్లిస్ మాత్రం వ్యతిరేకించడం దురదృష్టకరమన్నారు.

English summary
State BJP president G Kishan Reddy on Saturday advised Chief Ministers K Chandrasekhar Rao and N Chandrababu Naidu to leave the cash for vote scam to the investigating agencies and focus on development of the states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X