చలి చంపేస్తోంది బాబోయ్.. ఈ 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్..
రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఉదయం 9, 10 గంటలు దాటినా చలి తీవ్రత అలాగే ఉంటోంది. ఇక రాబోయే రెండు రోజులూ తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక తెలంగాణ కాశ్మీర్ గా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. మరో రెండు రోజులపాటు చలి అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. జిల్లాలో చలి రోజు రోజుకూ పెరుగుతోంది. ఉదయం 9, 10 గంటలు దాటినా చలి ఏమాత్రం తగ్గడం లేదు. అలాగే సాయంత్రం 6 గంటలకే చలి క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వృద్ధులు, చిన్నారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి మరింత పెరుగుతుందని.. ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో తాజాగా 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సోనాల మండలంలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్ లో ఇదే అతి తక్కువ కావడం గమనార్హం. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ చలి తీవ్రత అధికంగానే ఉంది. హైదరాబాద్ లోనూ చలి క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని అటు వైద్యులు సైతం సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications