Pushpa -2: ఢిల్లీకి చేరిన ఫిర్యాదు - పుష్ప వాట్ నెక్స్ట్..!!
పుష్ప -2 విడుదల వేళ చోటు చేసుకున్న ఘటనల పైన వరుస ఫిర్యాదులు నమోదు అవుతు న్నాయి. పుష్ఫ -2 విడుదల సమయం నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సినిమా ప్రీమియర్ షో వేళ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ కేసులో అల్లు అర్జున్ పేరు చేర్చారు. ఈ ఘటన పైన మూవీ మేకర్స్ మైత్రి సంస్థ స్పందించింది. ఇప్పుడు ఈ అంశం ఢిల్లీకి చేరింది. దీంతో, ఇప్పుడు మూవీ మేకర్స్.. అల్లు అర్జున్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది.
పుష్ప -2 ప్రీమియర్ షో వేళ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అనుమతి లేకుండా ప్రీమియర్ షో ఏర్పాటు చేసారని ధియేటర్ పైన ఇప్పటికే కేసు నమోదైంది. కాగా, పోలీసులు సైతం ధియేటర్ నుంచి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తేల్చారు. ప్రముఖులు ధియేటర్ కు వస్తున్నట్లు ముందస్తు సమచారాం లేదని చెప్పారు. దీంతో, ధియేటర్ తో పాటుగా అల్లు అర్జున్, వ్యక్తిగత సిబ్బంది పైనా కేసు నమోదు చేసారు. ఈ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షో లను రద్దు చేసింది.

ఇదే ఘటన పైన తాజాగా జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును మానవ హక్కుల సంఘం విచారణకు స్వీకరించింది. మృతురాలి కుటుంబా నికి రూ.5 కోట్లు పరిహారం ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవా లని కోరారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే తొక్కిసలాటలో ఓ మహిళ చనిపో యిందని ఫిర్యాదులో వివరించారు. థియేటర్ లో సినిమా చూసేందుకు అల్లు అర్జున్ రావటంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో రేవతి (35) అనే మహిళ తొక్కిసలాటలో మరణించారు.












Click it and Unblock the Notifications