Telangana Elections 2023: కాంగ్రెస్ యాడ్స్ పై బీఆర్ఎస్ ఫిర్యాదు.. గులాబీ పార్టీకి భయం పట్టుకుందన్న హస్తం..
పదేండ్ల వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రకటనలు ప్రగతిభవన్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ యాడ్స్ ఆపాలని ఎన్నికల సంఘంపై బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. టీవీ యాడ్స్ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల కోడ్ అతిక్రమించిందని బీఆర్ఎస్ లీగల్ టీమ్ సోమా భరత్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వకుండానే ఇచ్చినట్లు మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికల నుంచి ఆ వీడియోలను తెప్పించామని.. కాంగ్రెస్ పార్టీ యాడ్స్‌పై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల సంఘం సీరియస్ అయిందని ఆయన తెలిపారు.
ఇక నుంచి ఇలాంటి పనులు అపుకోవాలని.. లేదంటే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు సోమా భరత్ పేర్కొన్నారు. అన్ని రకాల నిబంధనలు పాటించినా కాంగ్రెస్ యాడ్స్ పై, బీఆర్ఎస్ ఒత్తిడితో ఈసీ నిబంధనలు విధించడం సరికాదని కాంగ్రెస్ పేర్కొంది. ప్రకటనలు ఆపగలరేమో.. ప్రజాతీర్పును ఆపలేరని స్పష్టం చేసింది. యాడ్స్ తో బీఆర్ఎస్ వణికిపోతోందని విమర్శిచింది. కాంగ్రెస్ రూపొందించిన యాడ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

మార్పు కావాలి- కాంగ్రెస్ రావాలి.. పేరుతో ఓ సెటైరికల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. 40 సెకెన్ల నిడివి ఉండే ఓ షార్ట్ వీడియోను రూపొందించింది. కేసీఆర్ డూప్‌ను రంగంలోకి దించింది. కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలను పోలిన విధంగా సెటప్ చేసి యాడ్స్ చేసింది. కాంగ్రెస్ రూపొందించిన యాడ్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షించాయి.నిరుద్యోగులు, రైతులు, ధరణి పోర్టల్, రైతుల ఆత్మహత్యలు వంటి అంశాలపై కాంగ్రెస్ యాడ్స్ రూపొందించింది. ప్రతి యాడ్ లో కారు పంక్షర్ పేరుతో వినూత్న రీతిలో ప్రకటనలు రూపొందించింది. ఈ యాడ్స్ ప్రజల్లోకి వేగంగా వెళ్తోన్నాయి.
కేసీఆర్ డూప్ ప్రసంగిస్తోండగా.. వాటికి పక్క నుంచి కౌంటర్లు ఇస్తోండటం ఈ క్యాంపెయిన్ ప్రత్యేకంగా రూపొందించారు. ఇదివరకు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రచారాలను చేపట్టింది. అది సక్సెస్ కావడంతో తెలంగాణలో కూడా అలాంటి వీడియోలే రూపొందించింది. కాంగ్రెస్ ప్రకటనలకు ప్రజలనుంచి మంచి స్పందన వస్తుండడంతో.. బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications