ఫిరాయింపు ఎమ్మెల్యే పెట్టిన చిచ్చు.. ఖమ్మంలో రాళ్ళతో కొట్టుకున్న కాంగ్రెస్ ,టీఆర్ఎస్ కార్యకర్తలు

Recommended Video

    రాళ్ళతో కొట్టుకున్న కాంగ్రెస్,TRS కార్యకర్తలు !! || Oneindia Telugu

    ఖమ్మం జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఫిరాయింపు కాంగ్రెస్ , టీఆర్ఎస్ మధ్య ఘర్షణకు కారణం అయ్యింది. ఖమ్మం జిల్లాలో ఎంపీటీసీ , జడ్పీటీసి ఎన్నికల వేళ ఫిరాయింపు విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివాన అయ్యింది. ఇరు వర్గాల బాహాబాహీతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్ళతో దాడి చేసుకునేదాకా వెళ్ళింది.

    స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ..

    స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ..

    తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఈరోజు కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఇల్లెందు ఎమ్మెల్యే , గిరిజన ఎమ్మెల్యే అయిన హరిప్రియ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి ఖమ్మంలోని కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి వెళ్ళారు . అయితే హరిప్రియ టీఆర్ఎస్ లో చేరడంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆమెను అక్కడ ప్రచారం నిర్వహించకుండా అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని నినాదాలు ఇచ్చారు.

    కాంగ్రెస్ , టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ ... రాళ్ళతో దాడి

    కాంగ్రెస్ , టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ ... రాళ్ళతో దాడి

    ఇక అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు పోటీగా నినాదాలు చేశారు . హరిప్రియకు మద్దతుగా గులాబీ కార్యకర్తలు నిలిచారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా అదికాస్తా ఘర్షణగా మారింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడిచేసుకున్నాయి. ఈ సందర్భంగా పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

    హరిప్రియా నాయక్ ను పంపించివేసి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు..

    హరిప్రియా నాయక్ ను పంపించివేసి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు..

    ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు వీలుగా హరిప్రియను అక్కడి నుంచి పంపించివేశారు. కాగా, ప్రస్తుతం గోవింద్రాల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+