Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జై కేసీఆర్.. టంగ్ స్లిప్ అయిన కాంగ్రెస్ అభ్యర్థి, ఎర్రబెల్లి ప్రత్యర్థి!!

తాజాగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తలమునకలై పోయారు. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టడానికి ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ప్రచార సభలలో, రోడ్ షోలలో నేతలు పొరపాటున ప్రత్యర్థి పార్టీల నాయకులకు జై కొడుతున్నారు. తాజాగా అటువంటి సంఘటనే పాలకుర్తి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పాలకుర్తి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రసవత్తరంగా మారింది. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుండి దిగ్గజ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బరిలో ఉన్నారు.

Congress candidate Errabelli dayakar rao rival slipped her tongue and said jai kcr

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎర్రబెల్లి అంత రాజకీయ అనుభవం కూడా లేని 26 సంవత్సరాల పిన్న వయస్కురాలైన మామిడాల యశస్విని రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇరువురి మధ్యనే ద్విముఖ పోరు కొనసాగుతుంది. అయితే ఎన్నికల ప్రచారంలో నేతలు మాట్లాడుతున్న మాటలు మాత్రం పాలకుర్తి నియోజకవర్గం ప్రజలను అవాక్కయ్యేలా చేస్తున్నాయి.

మొన్నటికి మొన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారంలో ఈసారి సంక్షేమ పథకాలు తనకు ఓటేసిన వారికే ఇస్తానని బాహాటంగా వెల్లడించారు. కేవలం తనకు ఓటు వేసిన వారికి ఇస్తానని చెప్పడంతో ఆయన ప్రసంగాన్ని విన్నవారంతా షాక్ అయ్యారు. ఓటు వెయ్యకుంటే ఇవ్వరా అని గుసగుసలాడుకున్నారు.

ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి కూడా టంగ్ స్లిప్ అయ్యి జనాలను అవాక్కయ్యేలా చేశారు. యశస్విని రెడ్డి తన ప్రచారంలో జై కాంగ్రెస్ అనాల్సిన చోట జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత వెంటనే నాలుక్కరుచుకున్నారు. ఇక ఈ వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక యశస్విని రెడ్డి జై కేసీఆర్ అనడం చూసిన ఓటర్లు తెగ నవ్వుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+