హైదరాబాద్ కు ప్రియాంకగాంధీ - కీలక నిర్ణయం..!?

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తెలంగాణలో తొలి రాజకీయ సభకు హాజరవుతున్నారు. ప్రియాంక పర్యటనకు పార్టీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. హైదరాబాద్ లో ప్రియాంక పర్యటన అయిదు గంటలు మాత్రమే కొనసాగనుంది. యువ సంఘర్షణ సభలో ప్రియాంక పాల్గొంటారు.

ప్రియాంక గాంధీ సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. తెలంగాణ బాధ్యతలు ఇక ప్రియాంకకు అప్పగిస్తారనే ప్రచారం వేళ తాజా పర్యటన ఆసక్తిని పెంచుతోంది. కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Congress general secretary Priyanka Gandhi to visit Hyderabad, address a public meeting

ప్రియాంకగాంధీ పర్యటన: ప్రియాంకగాంధీ రేపు (సోమవారం) హైదరాబాద్ రానున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకొని ప్రియాంక హైదరాబాద్ చేరుకుంటారు. బెంగళూరు నుంచి సాయంత్రం 3.30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రియాంకగాంధీ.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా సరూర్‌నగర్‌ స్టేడియానికి సాయంత్రం 4 గంటలకు చేరుకోనున్నారు.

ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించనున్నారు. ప్రియాంక ప్రసంగం 20 నుంచి 25 నిమిషాలపాటు ఉంటుంది. ఆ వెంటనే ఆమె హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

యువ సంఘర్షణ సభలో: సరూర్‌నగర్‌ స్టేడియానికి సాయంత్రం 4 గంటలకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించనున్నారు. ప్రియాంక ప్రసంగం 20 నుంచి 25 నిమిషాలపాటు ఉంటుంది. ఆ వెంటనే ఆమె హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

సాయంత్రం 5.30 గంటల ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకుంటారు. మొత్తంగా సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంకగాంధీ 45 నుంచి 50 నిమిషాలపాటు గడపనున్నట్లు వెల్లడించాయి. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో నియమించి ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతామో సభలో వివరిస్తాం. ప్రియాంక గాంధీ సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు.

Congress general secretary Priyanka Gandhi to visit Hyderabad, address a public meeting

తెలంగాణ బాధ్యతలు: తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా ప్రియాంకు బాధ్యతలు అప్పగిస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ సారి తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ బలంగా భావిస్తోంది. దీని కోసం ప్రియాంకకు బాధ్యతలు అప్పగించటం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచే ప్రియాంకగాంధీ పోటీ చేస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది.

ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో, వాటి ఫలితాల ఆధారంగా ప్రియాంక లోక్ సభకు పోటీ చేసే అంశం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం..తెలంగాణ భవిష్యత్ కోసం తన పాత్ర పైన ప్రియాకగాంధీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+