Congress: ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు..
బీఆర్ఎస్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రైతుబంధు నిధులను కేసీఆర్ నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. వికాస్ రాజ్ ను కలిసిన వారిలో రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్, పొంగులేటి, మధుయాష్కీ బీఆర్కే భవన్ లో వికాస్ రాజ్ తో సమావేశమయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి.. సీఎం కేసీఆర్ కు ఎలాంటి అధికారం లేకపోయినా.. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా నిధులు చెల్లిండం తప్పన్నారు. 6 వేల కోట్ల రైతుబంధు నిధులను మళ్లిస్తున్నట్లు వివరించారు. భూ రికార్డులు మారుస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. రంగారెడ్డి,సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని అసైన్డ్ ల్యాండ్ రికార్డులు మారుస్తున్నారని ఆరోపించారు.













Click it and Unblock the Notifications