Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ వ్యాఖ్యల కలకలం - రంగంలోకి పార్టీ హైకమాండ్, క్లారిటీ..!!

టీపీసీసీ చీఫ్ రేవంత్ చేసిన ఉచిత విద్యుత్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. పార్టీకి డామేజ్ కాకుండా నేరుగా పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే ఉచిత విద్యుత్ పార్టీ పేటెంట్ అని స్పష్టం చేసారు. విధాన పరమైన నిర్ణయాలు..పార్టీ మేనిఫెస్టో హైకమాండ్ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు. సీడబ్ల్యూసీలో చర్చించి తీసుకొనే నిర్ణయాలు మినహా వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యత ఉండదని తేల్చేసారు.

ఉచిత విద్యుత్ పై థాక్రే క్లారిటీ: రేవంత్ వ్యాఖ్యలతో జరిగిన డామేజ్ పార్టీ ఇమేజ్ కు దెబ్బ కాకుండా ఎంపిక చేసిన నేతలను కాంగ్రెస్ నాయకత్వం రంగంలోకి దించింది. రేవంత్ స్వయంకృతంతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణలో తమ పార్టీకి బలం పెరుగతున్న వేళ..బీఆర్ఎస్ రేవంత్ వ్యాఖ్యలను అస్త్రంగా మలచుకొనే ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలను పార్టీ విధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది.

Congress high command interfere on Revanth comments on free power comments controversy

దీంతో ఏం జరుగుతుందో పార్టీ నాయకత్వం అంచనా వేసింది. రేవంత్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందని గుర్తించింది. వెంటనే పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే పార్టీ వైఖరిని స్పష్టం చేసారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని ప్రకటించారు. కాంగ్రెస్ విధానంలోనే ఉచిత విద్యుత్ ఉందని.. రైతులకు అన్ని వేళలా అండగా నిలిచేది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేసారు.

పార్టీ కట్టుబడి ఉందని హామీ: తెలంగాణలోనూ రైతులకు కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కొనసాగిస్తుందని..వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా పార్టీ వైఖరిలో మార్పు లేదని థాక్రే ఖరాఖండిగా తేల్చి చెప్పారు. రేవంత్ వ్యాఖ్యల డామేజ్ కంట్రోల్ చేయటానికి రేవంత్ జిల్లాకే చెందిన వంశీచంద్ రెడ్డిని పార్టీ రంగంలోకి దించింది. రేవంత్ వ్యాఖ్యలతో పార్టీ విధానం ఏంటనేది వంశీచంద్ వివరించారు. అమెరికా లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని వంశీచంద్ రెడ్డి చెప్పుకొచ్చారు.

రైతులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంది...ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపిక పై కాంగ్రెస్ విధానం అందరికీ తెలిసిందేని రేవంత్ చేసిన సీతక్క సీఎం వ్యాఖ్యల విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ చర్చించి ఎవరికీ నాయకత్వం ఇవ్వాలో నిర్ణయిస్తారని వివరించారు.

కాంగ్రెస్ నేతల ధీమా: బిఆర్ఎస్, బిజేపి లు కలిసి పనిచేసినా కాంగ్రెస్ పార్టీ యే అధికారంలోకి రాబోతుందని టీ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ తరువాత ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని చెబుతున్నారు. తెలంగాణా రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ను అందిస్తామని కాంగ్రెస్ నేతలు ముక్త కంఠంతో ప్రకటిస్తున్నారు.

ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేసారు. ఇందిరమ్మ రైతు భరోస పధకం ద్వారా కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇస్తున్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన "రైతు డిక్లరేషన్"ను యధాతధంగా అమలు చేస్తామని భరోసా నింపుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+