RTC: మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం.. హామీ ఇవ్వడానికి సిద్ధమై కాంగ్రెస్.. అమలు చేసే యోచనలో బీఆర్ఎస్..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు మేనిఫేస్టో రూపొందించడంలో బిజీగా మారాయి. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని మొదటగా తమిళనాడులో ప్రవేశపెట్టారు.
అక్కడ ఈ పథకం విజయవంతం అవడంతో కర్ణాటలో కాంగ్రెస్ మేనిఫేస్ట్ లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని అమలు చేస్తోంది. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ హామీ ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ ఆలోచిస్తుంది. ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మేనిఫేస్టో చేర్చాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఈ పథకాలు తమిళనాడు, కర్ణాటకలో విజయం సాధించడంతో తెలంగాణలో కూడా ప్రజల నుంచి మంచి ఆదారణ లభిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన.. దీనిపై బీఆర్ఎస్ కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ఈ హామీ ఇవ్వకముందే బీఆర్ఎస్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని పలువురు బీఆర్ఎస్ నేతలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రులు దీనిపై ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే కొంత మంది అధికారులు కొద్ది రోజుల క్రితం తమిళనాడు వెళ్లారు. అధికారులు బృందం తమిళనాడు ఆర్టీసీ అధ్యయనం చేసింది. అక్కడ ఆర్డినరి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం విజయవంతమైందని గుర్తించింది. ఇందుకు సంబంధించి నివేదిక కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
కర్ణాటకతో పోలిస్తే తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బాగుందని అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో కూడా అమలు చేస్తే బాగుంటుందని అధికారులు ఆర్టీసీ మేనేజ్‌మెంట్‌కు ఓ రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ రాష్ట్ర ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు వయసుతో సంబంధం లేకుండా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు 2021లో ప్రారంభించారు. తమిళనాడులో మొత్తం 22500 ఆర్టీసీ బస్సులు ఉండగా, 7500 ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు.
కర్ణాటకలో మొత్తం 18609 బస్సుల్లో అన్నింటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణస సౌకర్యం కల్పించారు. ఇందులో 6343 ఎక్స్‌ప్రెస్, 6308 సిటీ సర్వీసులు, 5958 ఆర్డినరీ బస్సులున్నాయి. మొదటి నెలలో కర్ణాట వ్యాప్తంగా 17.40 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం లేక ముందు రోజుకు సగటున 85 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవారు. పథకం ప్రారంభమయ్యాక ఆ సగటు సంఖ్య 1.09 కోట్లకు పెరిగింది. అటు మహారాష్ట్రలో కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications