కాంగ్రెస్ మునిగిపోయే పడవ .. 2సీట్లతోనే రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్.. ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని ఆయన తెలిపారు. పార్టీ 16 సీట్లలో దేశ రాజకీయాల్లో ఏమి మార్పులు తీసుకు వస్తారని కాంగ్రెస్ నాయకులు కారు కూతలు కూస్తున్నారో అర్థం కావడం లేదు అన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కేవలం రెండు సీట్లతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కెసిఆర్ దని గుర్తు చేశారు.
మహబూబాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రచారంలో పాల్గొన్నారు. హెలికాప్టర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత, ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకుల నుండి ఘన స్వాగతం లభించింది. ఏటూరునాగారం లోనూ వెంకటాపురం లోనూ జరిగిన సభల్లో పాల్గొన్న ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయమని ఎర్రబెల్లి దయాకర్ రావు 16 పార్లమెంటు స్థానాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలని గుర్తు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టారని చెప్పిన ఎర్రబెల్లి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఒరిగే ప్రయోజనమేమీ లేదని తెలియజేశారు. ఇక గిరిజనులు పోడు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడంతోపాటు రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. మొత్తానికి ఎన్నికల ప్రచార పర్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దూసుకుపోతున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications