Vijayashanti: ప్రజలను కేసీఆర్ మోసం చేశారు.. విజయశాంతి..
తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు. అధికారంలోకి రాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చి ఆయనే సీఎం అయ్యాడని చెప్పారు. నిర్మల్ నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. నిర్మల్ లో ఇన్ని రోజులుగా మంత్రి పదవి అనుభవించిన ఇంద్రకరణ్ రెడ్డి చుట్టూ ఉన్న చెరువులను కూడా కబ్జా చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ తిన్న ప్రతి పైసా కక్కిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో శ్రీహరి రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రజలు గెలవాలంటే.. చేతి గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఆరు అంశాలను విజయశాంతి ప్రజలకు చెప్పారు. రూ.500 సిలిండర్, రైతు భరోసా పథకాలను వివరించారు.

అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పంపించాలన్నారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనని చెప్పారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కై, కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి యత్నిస్తున్నాయని ఆరోపించారు.
కేసీఆర్ 10 ఏళ్ల దోపిడీ, అరాచకాల పాలన నుంచి బయటపడేలా ఓటర్లు మంచి తీర్పు ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వకుండా.. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులను కేసీఆర్ కల్పించారని చెప్పారు. ఢిల్లీ మద్యం స్కామ్ లో కుమార్తె (ఎమ్మెల్సీ కవిత) అరెస్ట్ కాకుండా చూసుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications