Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏందీది.. తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు..!
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు.
మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని తప్పుబట్టారు. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకోవాలని కోరారు. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని అన్నారు.
అటు మాజీ ఎంపీ మల్లు రవి కూడా వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎన్నికల వేళ ఇలాంటి వ్యాఖ్యలు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తాయని చెప్పారు. పోత్తులు అవసరం లేదని.. కాంగ్రెస్ ఒంటరిగానే గెలుస్తుందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై
బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పందించారు. కాంగ్రెస్ పోరాటం నుంచి తప్పుకుందని ఎద్దేవా చేశారు. ఏ పార్టీ అయినా గెలుస్తామన చెబుతుంది.. కానీ కాంగ్రెస్ మాత్రమే ఓడిపోతుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని చలోక్తుల విసిరారు.
ఓడిపోతామని తెలిసి కూడా ఆ పార్టీ నేతలు ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో విజయం సాధిస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

వెంకట్ రెడ్డి ఏమన్నారంటే..
భవిష్యత్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవక తప్పదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని చెప్పారు. ఏ పార్టీ కూడా 60 సీట్లు గెలవలేదని.. హంగ్ తప్పదని జోస్యం చెప్పారు. దీంతో కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గాడిలో పడుతుందని చెప్పారు. కొత్తైనా.. పాతైనా.. గెలిచేవారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీని ఒక్కరే గెలిపించడం సాధ్యం కాదన్నారు.
త్వరలో పాదయాత్ర
తను స్టార్ క్యాంపెయినర్ అని.. మార్చి మొదటి వారంలో పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికలకు 3,4 నెలల సమయమే ఉందని.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు 60 రావన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ బీజేపీతో, బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోలేవు. కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కష్టపడితే కాంగ్రెస్ కు 40-50 సీట్లు వచ్చే అవకాశం ఉందని వెంకట్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు కనీసం ఏడాది ముందుగానే అభ్యర్ధులను ప్రకటించాలని రాహుల్ గాంధీని ఇప్పటికే కోరినట్లు తెలిపారు.

ఫలితాల తర్వతే
కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ పొగడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయన్నాని వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కాంగ్రెస్ ను పొగిడారని భావిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకపోయినా.. ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తులు ఉండే అవకాశం ఉందన్నారు.
అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. పరోక్షంగా రేవంత్ రెడ్డిని విమర్శించినట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటాలు మానుకుని పార్టీ కోసం పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications