Telangana: రైతులకు బేడీలు వేసింది బీఆర్ఎస్ సర్కారే..!
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేస్తారా.. వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు ధీటుగా స్పందించారు. ఆనాడు మద్దతు ధర కోసం నిరసన వ్యక్తం చేస్తే రైతులకు బేడీలు వేసింది బీఆర్ఎస్ సర్కార్ కాదా అని నిలదీశారు. నెరేళ్ల బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి సంసారాలకు పనికి రాకుండా చేసింది కేటీఆర్ కాదా అని గుర్తు చేస్తున్నారు. తప్పులన్నీ వారు చేసి తమ మీద అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు, కవిత కలిసి తెలంగాణను దోచుకు తిన్నారని ఆరోపించారు. ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో కూడా కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం ఎలా ఉంటుందో కేటీఆర్ తెలుసా అని ప్రశ్నించారు. కేసీఆర్ తనకు ఇష్టమొచ్చినట్లు విగ్రహాన్ని రూపొందించి తెలంగాణ భవన్ లో పెట్టుకున్నారని.. పదేళ్లలో ఏనాడు కూడా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేదని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలోని అన్ని వర్గాలకు బతుకును ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు వివరించారు. కొంత మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను రెడ్డి కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ వెలమ పార్టీ కాదా అని నిలదీశారు. కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని.. కానీ గులాబీ పార్టీలో కేసీఆర్ చెప్పింది వేదం.. బీఆర్ఎస్ పక్కా వెలమ కుటుంబ పార్టీ. పార్టీలో వారే అధ్యక్షులు ఉంటారని చెప్పారు.
కానీ కాంగ్రెస్ లో ఎవరైనా అధ్యక్షుడు కావొచ్చని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ ను నియమించిన ఘనత కాంగ్రెస్ అధిష్టానానికే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కేసీఆర్ కు ప్రజల సమస్యలపై పట్టింపు లేదని.. ఆయన రాజు లాగా భావించి అసెంబ్లీకే రావడం లేదని ఎద్దేవా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications