Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తన ఆస్తులు ప్రభుత్వానికి.. తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కెసిఆర్ ను దీటుగా ఎదుర్కొన్న వ్యక్తి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. నిత్యం మీడియాలో తనదైన శైలిలో కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. తనపై కేసులు పెట్టి జైలుకు పంపించినా మొక్కవోని ధైర్యంతో మళ్ళీ కెసిఆర్ పై యుద్ధం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న..

ఆస్తులను ప్రభుత్వ పరం చేసిన తీన్మార్ మల్లన్న
ఇక అటువంటి తీన్మార్ మల్లన్న ఖమ్మం నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే దీనికి ముందు ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీన్మార్ మల్లన్న తాను ప్రజాప్రతినిధిగా పోటీ చేయవలసి వస్తే, తన ఆస్తులన్నీ ప్రభుత్వ పరం చేస్తానని చెప్పారు. ఇక ఈ క్రమంలోని ఆయన తన కుటుంబం పేరుతో ఉన్న మొత్తం ఆస్తిని తెలంగాణ ప్రభుత్వం పేరుతో బాండు రాసిచ్చారు.

Congress MLC candidate teenmar Mallanna sensational decision of his assets

మాట మీద నిలబడిన తీన్మార్ మల్లన్న
తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి రాసిచ్చిన బాండ్ ప్రకారం తీన్మార్ మల్లన్న మొత్తం ఆస్తి ఒక కోటి 50 లక్షల రూపాయలు. ఆయన ప్రభుత్వానికి ఇచ్చేస్తున్న వెల్లడించారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా ప్రతినిధిగా పోటీ చేస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.

ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోరు కొనసాగుతుంటే మరొకవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కూడా రావడంతో ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు పాలన చేసిన బి ఆర్ ఎస్ సర్కార్ పై తనదైన శైలిలో విరుచుకుపడిన తీన్మార్ మల్లన్న తన విశ్లేషణల ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ అవకాశం
గత ప్రభుత్వ వైఫల్యాలను నిర్మొహమాటంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. తనపై ఎంత ఒత్తిడి తెచ్చినా, జైలుకు పంపిన భయపడలేదు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు తాను చెప్పదలుచుకున్నది నిర్మొహమాటంగా, నిర్ద్వందంగా చెప్పేశారు. ఇక రాజకీయాల్లో కీలకంగా పనిచేయాలని భావించిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలని ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇక ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు అవకాశం దక్కింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+