Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ సీఎం అయనే ?, కర్ణాటక ఫార్ములాను రిపీట్ చేస్తున్న హైకమాండ్, 2013 టూ 2023లో !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరాష్ట్రంలోని ఓటర్లు నాయకుల తలరాతలను మార్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూసుకోతున్నది. సీఎం కేసీఆర్ తోపాటు కారు గుర్తు మీద పోటీ చేసిన అనేక మంది నాయకులు వారి భవిష్యత్తు ఏమిటి ? అంటూ అయోమయంలో పడిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కర్ణాటక రాజకీయాలను, కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో రిపీట్ చెయ్యడానికి సిద్దం అవుతోంది.

రెండుసార్లు వరుస విజయాలతో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ కారు గుర్తుతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎంగా పని చేసిన కేసీఆర్ మరోసారి సీఎం కావాలని ఆశపడ్డారు. అయితే 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించలేదు. బీఆర్ఎస్ నాయకులు ఓటమి అంచున నిలబడి క్లైమాక్స్ లో ఏమైనా మ్యాజిక్ జరుగుతుందా ? అంటూ వేచి చూస్తున్నారు.

 Congress party high command repeating Karnataka formula in Telangana after Telangana election results 2023
జడ్జ్ మెంట్ డే, మోదీ పవర్ తగ్గిందా ?, రాహుల్ సుడి తిరిగిందా ?, లోక్ సభ ఎన్నికల్లో సీన్ ?

తెలంగాణలో కర్ణాటక ఫార్ములా ఏమిటి ? అని ఆలోచిస్తున్నారా ?, అందుకు చాలా లెక్కలు ఉన్నాయి. గతంలో జేడీఎస్ పార్టీలో మంచి పేరు తెచ్చుకుని మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్ డీ దేవేగౌడ ఆశీస్సులతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పని చేశారు. తరువాత జేడీఎస్ చీఫ్ దేవేగౌడతో పాటు ఆ పార్టీ నాయకులతో తేడాలు రావడంతో ఆ పార్టీ నుంచి సిద్దరామయ్య బయటకు వచ్చేశారు.

 Congress party high command repeating Karnataka formula in Telangana after Telangana election results 2023

జేడీఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత సిద్దరామయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దరామయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీలోని చాలా మంది పెద్దలకు ఇష్టం లేదు. అయితే సోనియా గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్దరామయ్య తరువాత అప్పట్లో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తూ పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అయ్యారు.

బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కర్ణాటకలో బలంగా వినిపించిన సిద్దరామయ్య కాంగ్రెస్ లో బలమైన నాయకుడిగా అవతారం ఎత్తారు. తరువాత బెంగళూరు టూ బళ్లారి అంటూ పాదయాత్ర నిర్వహించిన సిద్దరామయ్య అప్పట్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేశారు. తరువాత కర్ణాటకలో 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించడంతో సిద్దరామయ్య సీఎం అయ్యారు.

2013 నుంచి 2018 వరకు ఐదు సంవత్సరాలు సిద్దరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. జేడీఎస్ నుంచి వలస వచ్చిన సిద్దరామయయ సీఎం కావడాన్ని చాలా మంది వ్యతిరేకించినా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమాత్రం పట్టించుకోకుండా ఐదు సంవత్సరాలు సిద్దరామయ్య సీఎంగా ఉండటానికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా సేమ్ సీన్ రిటీప్ అవుతోంది.

 Congress party high command repeating Karnataka formula in Telangana after Telangana election results 2023

తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన రేవంత్ రెడ్డి కొద్దికాలంలోనే కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం చేశారు. కేసీఆర్ తో పెట్టుకున్న రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు వ్యతిరేకించినా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు.

2013లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు 2023లో కూడా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ఓడిస్తున్న కాంగ్రెస్ అక్కడా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అవుతోంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చిన తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకులు వేచి చూస్తున్నారు.

అయతే జేడీఎస్ నుంచి వలస వచ్చిన సిద్దరామయ్య కర్ణాటక సీఎం అయ్యినట్లే తెలుగుదేశం నుంచి వలస వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అవుతురాని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే ఆశీస్సులు రేవంత్ రెడ్డికి పుష్కలంగా ఉన్నాయని తెలంగాణలోని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. మొత్తం మీద 2013లో కర్ణాటక జరిగిన సీన్, అలాంటి ఫార్ములా 2023లో తెలంగాణలో రిపీట్ అవుతుందా ?, లేదా ? అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేచి చూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+