జడ్జ్ మెంట్ డే, మోదీ పవర్ తగ్గిందా ?, రాహుల్ సుడి తిరిగిందా ?, లోక్ సభ ఎన్నికల్లో సీన్ ?
వచ్చే ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి, 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా ప్రపంచ దేశాలు భారత్ వైపు తిరిగిచూసేలా చేసిన నరేంద్ర మోదీ మరోసారి ఆయన సత్తా చాటుకోవడానికి సిద్దం అవుతున్నారు. కేంద్రంలోని ఎన్ డీఏ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇంటికి పంపించి అధికారం దక్కించుకోవాలని ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటి అవుతున్నాయి.
అయితే లోక్ సభ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలు సమయం ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు ఇప్పటి నుంచి పక్కాప్లాన్ సిద్దం చేసుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నవంబర్ లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఆదివారం ఉదయం కౌంటింగ్ మొదలైయ్యింది.

అనివార్య కారణాల వలన మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ని సోమవారాని ఎన్నికల కమీషన్ వాయిదా వేసింది. తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ ని ఢీకొట్టిన కాంగ్రెస్ పలు నియోజక వర్గాల్లో లీడింగ్ లో దూసుకుపోతున్నది. ఇక తెలంగాణలో అధిక పార్టీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ నుంచి గట్టిపోటీ ఎదురుకావడంతో అయోమయంలో పడిపోయింది.

తెలంగాణలో ఏంఐఎం ఆపార్టీ బలంగా ఉన్న నియోజక వర్గంలో ముందంజలో ఉంది. ఇక బీజేపీ మాత్రం నాలుగు నియోజక వర్గాల్లో సత్తా చాటుకుంటూ లీడింగ్ లో దూసుకుపోతున్నది. తెలంగాణలో ఎక్కువ నియోజక వర్గాల్లో ఆదిక్యంలో దూసుకుపోతున్నది. ఆదివారం 9.30 గంటల సమాయానికి తెలంగాణలో కాంగ్రెస్ 33 స్థానాల్లో, బీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ నాలుగు స్థానాల్లో, ఎంఐఎం నాలుగు స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.

ఇక రాజస్థాన్ లో బీజేపీ 80 నియోజక వర్గాల్లో, కాంగ్రెస్ 59 స్థానాల్లో, ఇతరులు 13 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో బీజేపీ 123 స్థానాల్లో, కాంగ్రెస్ 40 స్థానాల్లో, ఇతరులు ఒక్క స్థానంలో లీడింగ్ లో ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ 23 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో, ఇతరులు ఒక్కస్థానంలో లీడింగ్ లో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో బీజేపీ దూసుకుపోతుండటంతో ఆ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు.

ఇక ఛత్తీస్ గఢ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు నువ్వానేనా అంటూ పోటీపడుతున్నారు. మొత్తం మీద ఆదివారం నాలుగు రాష్రాల అసెంబ్లీ ఎన్నికల జడ్జిమెంట్ డే కావడంతో కాబోయే కింగ్ లు ఎవరు ?, అధికారంలోకి వచ్చి సత్తాచాటేది ఎవరు అని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేది ఎవరు ?, మోదీ పవర్ తగ్గిందా ?, రాహుల్ గాంధీకి సుడి తిరిగిందా ? అంటూ దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా గమనిస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications