'దీవానా' మూవీ రివ్యూ: గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. క్లైమాక్స్ ట్విస్ట్ కు పిచ్చోళ్లవుతారు!

తెలుగులో ఇప్పటివరకూ చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. తెలుగు ప్రేక్షకులు ప్రేమకథా చిత్రాలను బాగానే ఆదరించారు. ఒకప్పటి దేవదాసు, గీతాంజలి నుంచి మొన్నటి అర్జున్ రెడ్డి, సీతారామం వరకు టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన లవ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. ఇటీవలికాలంలో సీతారామం, బేబీ, హాయ్ నాన్న లాంటి ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో లవ్ స్టోరీ దీవానా మెప్పించిందా..?

మెయిల్, తరగతి గది లాంటి డీసెంట్ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో హర్షిత్ రెడ్డి. ఆయన నటించిన కొత్త మూవీ 'దీవానా'.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూత్ కు ఎక్కేశాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 20 న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల అయింది. హైదరాబాద్ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ అందమైన యూత్‌ ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ సాగుతుంది. ఈ మూవీలో హర్షిత్ రెడ్డి సరసన హీరోయిన్ గా స్మేహా మణిమేఘలై నటించింది. ఇక ఈ సినిమాకు శ్రీకాంత్ సంఘిశెట్టి దర్శకత్వం వహించారు.

దీవానా స్టోరీ విషయానికి వస్తే.. ఇది ఒక లవ్ ఎమోషనల్ హార్ట్ టచింగ్ డ్రామా.. మున్నా (హర్షిత్ రెడ్డి) ఓ నిరుద్యోగి.. డిగ్రీ చదివి ఏ పని చేయకుండా బాధ్యతలేకుండా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో మీ సేవ కేంద్రంలో పనిచేసే హీరోయిన్ అమూల్య (స్నేహ మణిమేఘలై) ను చూసి ప్రేమిస్తాడు. ఈ క్రమంలో ఆమె ఓ షరతు పెడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించమని కండీషన్ పెడుతుంది. ఈ లక్ష్యంతో మున్నా ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈలోగా కుటుంబ సమస్యలు, ప్రేమలో ట్విస్ట్ కథను మలుపు తిప్పుతాయి.

Deewana Movie Review Harshit Reddy Starrer Deeply Emotional Love Story That Boys Will Totally Love

దీవానా మూవీ స్లోగా స్టార్ట్ అయినా ముందుకు వెళ్లే కొద్ది తరువాత ఏం జరుగుతుంది.. అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఓవైపు లవ్ స్టోరీ.. మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ను దర్శకుడు అద్భుతంగా చూపించాడు. సినిమాలోని ఎమోషన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్, ఒక షాకింగ్ ట్విస్ట్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తానికి సినిమా పూర్తయ్యే సరికి ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో దీవానా మూవీ సక్సెస్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+