ఒత్తిడి ఉంది, ఉద్యమ స్పూర్తితో పని చేయాలి - చంద్రబాబు...!!

ప్రస్తుత సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు. దేశానికి ఆధ్యాత్మిక హబ్‌గా ఏపీ మారనుందని పేర్కొన్నారు. యోగా సాధనతో బాబారామ్‌దేవ్ అద్భుతాలు సృష్టిస్తున్నారని అభినందించారు. బాబారామ్‌దేవ్‌‌తో కలిసి సీఎం యోగా సాధన చేశారు. రామ్‌దేవ్ శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను తిలకించారు.

బాబారామ్‌దేవ్‌ ఏదైనా చేయగలరని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యోగాకు.. రామ్‌దేవ్ మంచి గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద అని చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత చాలా అవసరమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు. దేశానికి ఆధ్యాత్మిక హబ్‌గా ఏపీ మారనుందని పేర్కొన్నారు. ఉండవల్లి కొండల వద్ద యోగా.. చాలా అందమైన ఆలోచన అని అన్నారు. అమరావతి కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్‌ను ఒప్పించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల విడుదల వేళ కీలక నిర్ణయం, ఈ సారి వీరికే...!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల విడుదల వేళ కీలక నిర్ణయం, ఈ సారి వీరికే...!!
cm-chandrababu-and-yoga-guru-baba-ramdev-participated-in-the-yoga-andhra-2026-event-at-the-histori

ప్రతీ ఇంటికీ యోగా లక్ష్యంగా

ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడని బాబా రాందేవ్ పేర్కొన్నారు.గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు ఏం అడుగుతారో.. తాము అది చేస్తున్నామని తెలిపారు. యోగా మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని రామ్‌దేవ్ బాబా తెలిపారు. సీఎం చంద్రబాబు అందర్నీ సమానంగా చూస్తారని పేర్కొన్నారు. అమరావతి దేవతల రాజధాని అని.. ఇక్కడ 40 శాతం పచ్చదనం, 60 శాతం నిర్మాణాలు ఉంటాయన్నారు. ఇది దేవ భూమి అని వెల్లడించారు. స్విట్జర్లాంట్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదని... ఆంధ్రప్రదేశ్ వస్తే చాలని చెప్పారు. ఇక్కడి మామిడికాయలు, అరటిపండ్లు చాలా బాగుంటాయని.. ఎందుకంటే వాటిని సహజ సిద్ధంగా పండిస్తారని తెలిపారు. ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 'యోగా ఫర్ హెల్తీ ఏజింగ్' పేరుతో నిర్వహిస్తున్నామని రామ్‌దేవ్ బాబా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+