మరో కొత్త ఉద్యమం, E20 జనతా పార్టీ - అక్కడే గురి..!?
కాక్రోచ్ జనతా పార్టీ సక్సెస్ తో మరిన్ని కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఆన్ లైన్ వేదికగా తమ డిమాండ్లతో కొత్త పార్టీలు సిద్దం అవుతున్నాయి. రిజర్వేషన్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక వేదిక.. కేంద్రంలోకి కీలక మంత్రి లక్ష్యంగా E20 జనతా పార్టీ దర్శనమిస్తున్నాయి. వీటికి పెద్ద సంఖ్యలో మద్దతు దారులు పెరుగుతున్నారు. ఇప్పుడు E20 జనతా పార్టీ కేంద్రంగా రాజకీయంగా చర్చ మొదలైంది. వీరి డిమాండ్లు.. చర్యల పైన ఏం చేస్తారనేది రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది.
నీట్ పరీక్ష పత్రాల లీక్ వ్యవహారం పైన కాక్రోచ్ జనతా పార్టీ సంచలనంగా నిలిచింది. ఆన్ లైన్ పార్టీగా ఆవిర్భవించి.. కేంద్ర మంత్రిని పదవి నుంచి దించేలా విజయం సాధించింది. వీరి పోరాటం .. హోరెత్తిన నిరసనలు దేశంలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిగా మారాయి. ఇక, కాక్రోచ్ పార్టీ సక్సెస్ తో ఇప్పుడు మరో ఉద్యమం మొదలైంది. ఇప్పుడు ఇంధన అంశంపై మరో సరికొత్త ఉద్యమం తెరపైకి వచ్చింది. 'ఈ20 జనతా పార్టీ' పేరుతో మొదలైన ఈ క్యాంపెయిన్‌లో పెట్రోల్ బంక్‌లలో ఈ20 ఇంధనంతో పాటు 100 శాతం శుద్ధమైన పెట్రోల్‌ను విక్రయించేలా డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో వినియోగదారులకు ఎంపిక హక్కును ఇవ్వాలనేది ఈ సంస్థ ప్రధాన డిమాండ్ గా ఉంది. తాము ఇంధనంలో ఇథనాల్ కలపడానికి వ్యతిరేకం కాదని, ప్రత్యామ్నాయాలు లేకపోవడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ప్రధాన డిమాండ్ల పైన చర్చ
ఇప్పటికే E20 జనతా పార్టీ తమ లక్ష్యం ఏంటో వెల్లడించింది. వాహనాల ట్యాంకుల్లో ఏ ఇంధనం వేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను వినియోగదారులకే అవకాశం ఇవ్వాలనేది తమ డిమాండ్ గా వెల్లడించారు. ప్రస్తుతం ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ పార్టీ ఖాతాలకు వేలాదిగా ఫాలోవర్లు పెరుగుతుండటంతో ఈ ప్రచారం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ20 జనతా పార్టీ, ఇంధన రంగంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సంస్థ లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. కాక్రోచ్ పార్టీ ఈ డిమాండ్ల పైన కేంద్రం పై ఒత్తిడి తెచ్చే వ్యూహాలతో సిద్దం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో.. ఇప్పుడు ఈ కొత్త E20 జనతా పార్టీ తమ డిమాండ్ల సాధన కోసం ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తుందనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications