త్వరగా ఈ పని చెయ్యండి.. లేదంటే మీ గ్యాస్ సిలిండర్ బంద్!
ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు కీలక అలర్ట్. గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ల వినియోగంలో అర్హులైన వినియోగదారులను ఖరారు చేయడానికి ఆయిల్ కంపెనీలు చేపట్టిన ఈ కేవైసీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బోగస్ కనెక్షన్ లను తొలగించటం, కమర్షియల్ ప్రయోజనాలకు గృహ అవసర సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టటం లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపట్టారు.
ఈకేవైసీ చేసుకోని వినియోగదారులు
పదేపదే అవగాహన కల్పించిన ఇప్పటివరకు చాలామంది వినియోగదారులు ఈ కేవైసీ చేసుకోలేదు. దీంతో ఆయిల్ కంపెనీలు కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో 30 లక్షలకు డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వీరిలో కేవలం 70 శాతం మంది మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారు. మిగిలిన 30% వినియోగదారులు ఈ కేవైసీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

వినియోగదారులు ఈకేవైసీ ప్రక్రియపై నిర్లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో ఈ కేవైసీ ప్రక్రియ చాలా కాలంగా జరుగుతుంది. 2024 జూన్లో ఒక ఏడాది కాలానికి ప్రారంభించిన ఈ ప్రక్రియ ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగింది. గతంలో కూడా 2014లో ప్రారంభించిన ప్రక్రియ ఐదేళ్లపాటు కొనసాగించారు. ఈ క్రమంలో ఇప్పుడు కూడా నిదానంగా ఈ కేవైసీ చేసుకోవచ్చని, ప్రభుత్వం ఈ ప్రక్రియను పొడిగిస్తుందని భావిస్తున్న వినియోగదారులు ఈ ప్రక్రియపై నిర్లక్ష్యంగా ఉన్నారు.
ఈ కేవైసీ పూర్తికాని కనెక్షన్లకు సిలిండర్లు ఆపేసే అవకాశం
దీంతో ఈసారి రెండు సంవత్సరాల లోపల ఈ ప్రక్రియను ముగించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కేవైసీ పూర్తికాని కనెక్షన్లకు సిలిండర్లు ఆపేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్లో గ్యాస్ సరఫరా కొరత ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చాలాచోట్ల చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ వెండర్లు తమ వ్యాపారం గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను ఉపయోగిస్తున్నారు.
వినియోగదారులకు షాక్ ఇవ్వడానికి ఆయిల్ కంపెనీలు రెడీ
ఈ అక్రమ వినియోగం అరికట్టడానికి ఈ కేవైసీని ఒక ఆయుధంగా వాడాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ కేవైసీ చేసుకోని వినియోగదారులకు షాక్ ఇవ్వడానికి ఆయిల్ కంపెనీలు రెడీ అయ్యాయి. ఇక వినియోగదారులు ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో వారు సులభంగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. సంబంధిత కంపెనీల అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఈ కేవైసీ నమోదు చేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం నిర్ణీత గడువులోగా ప్రతి ఒక్కరు ఈ కేవైసీ పూర్తి చేయించుకుని గ్యాస్ పొందండి.












Click it and Unblock the Notifications