విద్యార్థుల లాఠీచార్జ్ పై కేంద్రానికి బిగ్ షాక్..! సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు నిరసనగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఢిల్లీలో విద్యార్ధులు భారీ ఎత్తున ఉద్యమించారు. పార్లమెంట్ మార్చ్ తో తమ నిరసన తెలపాలని భావించారు. కానీ వారిపై లాఠీచార్జ్ తో పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు (supreme court) ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుత నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా హామీ ఇవ్వబడిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీచార్జ్ చేయకూడదని తేల్చిచెప్పింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్ధులు భారీ ఎత్తున పార్లమెంట్ మార్చ్ నిర్వహించింది. 'సంసద్ చలో' పేరుతో నిరసన తెలుపుతూ విద్యార్థులు చేపట్టిన పాదయాత్రపై పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనల్లో భారీ ఎత్తున విద్యార్ధులు గాయపడ్డారు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఘటనలపై విచారణ కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు.. శాంతియుత, చట్టబద్ధమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా కల్పించబడిందని గుర్తుచేేసింది. అది శాంతియుత ఆందోళన అయినంత వరకు, కేవలం ఆందోళన జరిగిందన్న కారణంతో లాఠీచార్జికి తావులేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఢిల్లీ ఘటనలపై స్వతంత్ర విచారణ జరపాలని, సీసీటీవీ ఫుటేజ్, బాడీ-కెమెరా రికార్డింగ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను భద్రపరచాలని, గాయపడినట్లు తేలిన నిరసనకారులకు నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్లు ఈ సందర్భంగా సుప్రీంకోర్టును కోరారు.












Click it and Unblock the Notifications