రైతులకు దసరా కానుక- ఖాతాల్లో నిధుల జమ, ఒకేసారి రూ 6 వేలు...!!
రైతులకు బిగ్ అప్డేట్. కేంద్రం- ఏపీ ప్రభుత్వం దసరా కానుకగా రైతుల ఖాతాల్లో నిధుల విడుదల కు కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా రూ 20 వేలు అందిస్తోంది. పీఎం కిసాన్ తో అందే రూ 6 వేలతో పాటుగా ఈ నిధులను మంజూరు చేస్తోంది. కాగా.. 24వ విడత పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ముహూర్తం దాదాపు ఖరారైంది. దీంతో, రైతుల ఖాతాల్లో రూ 6 వేలు రెండు పథకాల కింద నిధులు జమ కానున్నాయి.
దసరా వేళ రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు పీఎం కిసాన్ 24వ విడత నిధుల జమ పైన కేంద్రం సిద్దం అవుతోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలలో పంపిణీ చేస్తున్నారు. ప్రతి విడత రూ.2,000 చొప్పున నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ పథకం కింద విడతలు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదలవుతాయి. చివరి విడత అయిన 23వ విడత జూన్‌లో విడుదలైంది.

దీంతో.. 24వ విడత నిధుల జమ పైన చర్చ సాగుతోంది. ఈ నెలలోనే తొలుత విడదల చేయాలని భావించారు. వినాయక చవితి వేళ ఈ నిధులు జమ చేయాలని ఆలోచన చేసారు. అయితే, కేంద్రంలో ఈ మేరకు తాజాగా జరిగిన చర్చల్లో అక్టోబర్ తొలి వారంలో ఈ నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ పథకంలో నిధులు పొందే రైతులు తమ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
పీఎం కిసాన్ -అన్నదాత సుఖీభవ నిధుల జమ
మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ఇందుకోసం మొత్తం సుమారు రూ.3,125.47 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు రెండో విడతలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను కలిపి ఒక్కో రైతుకు రూ.6 వేల చొప్పున అందించనున్నారు. రైతులు ఇంకా తమ ఇ-కేవైసీని పూర్తి చేయకపోతే, వారి తదుపరి వాయిదా జమ నిలుపుదల చేసే అవకాశం ఉందని చబుతున్నారు. పీఎం కిసాన్ వాయిదా స్థితిని తెలుసుకోవాలనుకుంటే రైతులుఆన్‌లైన్‌లో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.
అదే విధంగా పీఎం కిసాన్ నిధుల జమ సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయనుంది. గత ఏడాదిన్నార కాలంగా కేంద్ర నిధులతో పాటుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. దీని ద్వారా ఏపీలోని రైతులకు వచ్చే నెల అటు కేంద్రం.. ఇటు ఏపీ ప్రభుత్వం అందించే రూ 6 వేలు ఒకే విడత రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
