ధారావి ప్రాజెక్ట్ పనులకు స్పీడ్ పెంచేందుకు అదానీ కీలక నిర్ణయం..ఇదే కొత్త రూల్

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవి పునరాభివృద్ధి ప్రాజెక్టు (DRP) వేగాన్ని పెంచేందుకు అదానీ ధారవి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (ANDPL) కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లను ఖాళీ చేయడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసే నివాసితులకు చెల్లించే తాత్కాలిక అద్దెను (ట్రాన్సిట్ రెంట్) తగ్గించాలని ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) నిర్ణయించింది. ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, అదనపు ఖర్చులను అరికట్టేందుకే ఈ అడుగు వేసినట్లు సంస్థ స్పష్టం చేసింది.

అయితే, ఈ తాజా నిర్ణయం కేవలం మొండికేస్తూ పనులకు ఆటంకం కలిగిస్తున్న కొద్దిమందికి మాత్రమే వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది. నిబంధనల ప్రకారం స్వచ్ఛందంగా సహకరిస్తూ ఇళ్లను ఖాళీ చేస్తున్న వేలాది మంది నివాసితులకు పూర్తి స్థాయిలో లభించే తాత్కాలిక అద్దె ప్రయోజనాలతో పాటు తరలింపు ఖర్చులు యథావిధిగా అందుతాయని స్పష్టం చేసింది. కొద్దిమంది చేస్తున్న ఆలస్యం వల్ల దాదాపు 10 లక్షల మందికి అందాల్సిన ఇళ్ల నిర్మాణం ఆలస్యమవుతోందని అధికారులు పేర్కొన్నారు.

dharavi-redevelopment-non-cooperating-residents-to-get-reduced-transit-rent-says-andpl

ఇటీవలి కాలంలో ధారవి ప్రాంతంలో ఇళ్లను ఖాళీ చేయించే ప్రక్రియలో అధికారులకు ఎదురైన క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగానే ఈ సమూల చర్యలు చేపట్టారు. ఇటీవలే ధారవి ప్రాజెక్ట్ అధికారులు 85 ఇళ్ల తరలింపుకు నోటీసులు ఇవ్వగా, ఆయా కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం వారంతా ఎటువంటి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేశారు. కానీ మరో ఘటనలో 16 ఇళ్లకు నోటీసులు ఇవ్వగా, కౌన్సిలింగ్ ద్వారా కేవలం 12 కుటుంబాలు మాత్రమే ముందుకొచ్చాయి. మిగిలిన నివాసితులు మొండికేయడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ఆలస్యానికి పరిహారం తగ్గింపు - కొత్త అద్దె విధానం
ఉద్దేశపూర్వకంగా ఖాళీ చేయని వారికి తాత్కాలిక అద్దె కోతతో పాటు ఒకేసారి ఇచ్చే తరలింపు సాయం రూ. 5,000 కూడా రద్దు కానుంది. సవరించిన ఈ తాజా అద్దె వివరాలను పరిశీలిస్తే, గ్రౌండ్ ఫ్లోర్ నివాసితులకు ఇప్పటివరకు ఇస్తున్న రూ. 18,000 తాత్కాలిక అద్దె స్థానంలో ఇకపై కేవలం రూ. 15,000 మాత్రమే లభిస్తుంది. అలాగే మొదటి అంతస్తుల నివాసితులకు సాధారణంగా లభించే రూ. 15,000 కి బదులుగా కేవలం రూ. 12,000 మాత్రమే అందుతుంది.

ఇక వాణిజ్య మరియు పారిశ్రామిక రంగాల స్థలాల నివాసితులకు చదరపు అడుగుకు రూ. 175 నుంచి రూ. 145 కి అద్దె తగ్గించారు. మహారాష్ట్ర స్లమ్ ఏరియా చట్టం 1971 లోని నిబంధనలు, డీసీపీఆర్ 2034 నిబంధనల ప్రకారం పబ్లిక్ ప్రాజెక్టులకు అడ్డు తగిలే వారిపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. అయినప్పటికీ, కనీస మానవతా కోణంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసే వారికి కూడా ఈ సరికొద్దీ సవరించిన తాత్కాలిక అద్దెలను చెల్లించాలని అధికారులు నిర్ణయించారు.

ధారవి ప్రజలకు కల్పించే ప్రయోజనాలు
ఈ భారీ పునరాభివృద్ధి ప్రాజెక్టు కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు మెరుగైన నివాస సదుపాయాలు కల్పిస్తున్నారు. జనవరి 1, 2000 కంటే ముందు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసిస్తున్న అర్హులైన నివాసితులకు ధారవి ప్రాంతంలోనే 350 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇళ్లను ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా అందజేస్తారు. అలాగే 2000 నుంచి 2011 మధ్య కాలంలో ఇక్కడ స్థిరపడిన అర్హులైన నివాసితులకు రూ. 2.5 లక్షల చొప్పున చెల్లింపుతో నగర పరిధిలోనే 300 చదరపు అడుగుల ఇళ్లు లభిస్తాయి.

ఇక జనవరి 1, 2011 తర్వాత అక్కడ స్థిరపడిన నివాసితులకు, అలాగే మొదటి అంతస్తుల నివాసితులకు చౌక ధరల అద్దె విధానం కింద ధారవి వెలుపల 300 చదరపు అడుగుల ఇళ్లను కేటాయించనున్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయడం ద్వారా దాదాపు పది లక్షల మంది జీవితాలను మార్చే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ANDPL ప్రతినిధి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+