వచ్చేది మన ప్రభుత్వమే - వంగవీటి ఆశా కిరణ్ సంచలనం..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. స్థానిక ఎన్నికలను అటు కూటమి.. ఇటు వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఇదే సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాటు అంశం కీలకంగా మారుతోంది. కాగా.. తాజాగా వంగవీటి ఆశా కిరణ్ గోదావరి జిల్లాల కేంద్రంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. కొత్త చర్చకు కారణమవుతున్నాయి.
వంగవీటి కుమార్తె ఆశా కిరణ్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని తొలగించిన ఘటన వివాదం గా మారింది. తన తండ్రి విగ్రహాన్ని తొలిగించటం పైన ఆశా కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసు లను నిలదీసారు. బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు. ఆమె వెంట మద్దతుదారులు కూడా పెద్ద సంఖ్యలో చేరడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఉండ్రాజవరం సెంటర్‌లో కాపు యువత వంగవీటి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సరైన అనుమతులు లేవనే కారణంతో పోలీసు అధికారులు ఆ విగ్రహాన్ని దిమ్మెను తొలగించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ మరుసటి రోజు రంగా అభిమానులు మళ్లీ మరో విగ్రహాన్ని ప్రతిష్టించారు. కాగా, దాన్ని కూడా అధికారులు పొక్లెయిన్ సహాయంతో తొలగించడంతో అసలు వివాదం మొదలైంది.
ఆశా కిరణ్ తాజా వ్యాఖ్యలతో
దీంతో, వంగవీటి ఆశాకిరణ్ రంగంలోకి దిగారు. రంగా అభిమానులతో కలిసి ఆమె మెరుపు ధర్నా చేసారు. అక్కడకు వచ్చిన పోలీసు అధికారుల పైన ఆగ్రహం ప్రదర్శించారు. రంగా విగ్రహం అంటే మీకెందుకు అంత భయం అని కూడా ఆమె పోలీసులను నిలదీశారు. ఇదే సమయంలో ఆశా కిరణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి. విగ్రహం తొలిగింపును తప్పు బడుతూ.. భవిష్యత్ లో మన ప్రభుత్వం వస్తుందంటూ ఆశా కిరణ్ వ్యాఖ్యానించారు. దీంతో, పలు రకాల రాజకీయ చర్చలు తెర మీదకు వచ్చాయి. మన ప్రభుత్వం వస్తుందని చెప్పటం ద్వారా.. ఏ పార్టీలో చేరేదీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసారనే విశ్లేషణలు మొదలయ్యాయి. కాగా.. ఆశా కిరణ్ ఇప్పటి వరకు రాజకీయంగా తన భవిష్యత్ పైన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తన తండ్రి ఆశయ సాధన కోసమే పని చేస్తానని చెబుతూ వచ్చారు. కాగా, తాజా వ్యాఖ్యలతో ఆశా కిరణ్ భవిష్యత్ అడుగుల పైన ఆసక్తి నెలకొంది.















Click it and Unblock the Notifications
