ఇండియాకు కొత్త మార్గం! 730 కిలోమీటర్ల రైల్వే లైన్ రెడీ..

భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వ్యూహాత్మక ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇరాన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 730 కిలోమీటర్ల పొడవైన చబహార్-జెహదాన్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. ఈ రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే ఇరాన్‌లోని కీలకమైన సముద్ర ఓడరేవు నుంచి ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు రవాణా మార్గాలు మరింత సులభం కానున్నాయి. ముఖ్యంగా సముద్ర మార్గం ద్వారా దొరకని ప్రత్యక్ష రవాణా సదుపాయాన్ని భారత్ ఈ ప్రాజెక్ట్ ద్వారా సాధించే అవకాశం కలగడం విశేషం.

మూడు నాలుగు నెలల్లో పూర్తి స్థాయి రాకపోకలు

గత ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ భారీ రైల్వే ప్రాజెక్టు పనులు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. ప్రస్తుతం ఇరాన్ అధికారులు ఈ మార్గంలో చివరి దశ భద్రతా తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ సేఫ్టీ చెక్స్ అన్నీ పూర్తయిన తర్వాత రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ రైల్వే లైన్ పూర్తిగా ప్రజలకు, సరుకు రవాణాకు అందుబాటులోకి రానుందని సమాచారం. దీనివల్ల వాణిజ్య పరంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి.

Iran Completes 730-Km Chabahar Zahedan Railway Opening a New Trade Route for India to Central Asia

ఇంజనీరింగ్ అద్భుతంగా సొరంగాల నిర్మాణం

ఈ 730 కిలోమీటర్ల రైలు మార్గం కేవలం సాధారణమైనది కాదు, అదొక ఇంజనీరింగ్ అద్భుతం. ఇరాన్ ఆగ్నేయ తీరంలో ఉన్న చబహార్ ఓడరేవును, జెహదాన్ నగరంతో కలిపే ఈ మార్గంలో మొత్తం 33 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కేవలం స్టేషన్లే కాకుండా కొండలను చీల్చుకుంటూ 39 టన్నెల్స్, లోయలను దాటేందుకు ఏకంగా 201 వంతెనలను నిర్మించారు. ఈ కఠినమైన భౌగోళిక పరిస్థితులను ఎదుర్కొని మార్గాన్ని సిద్ధం చేయడం గమనార్హం.

దేశంలోనే మొట్టమొదటి సారిగా పట్టాలెక్కిన LNG ట్రైన్: ఈ స్టేషన్ల మధ్య పరుగులు
దేశంలోనే మొట్టమొదటి సారిగా పట్టాలెక్కిన LNG ట్రైన్: ఈ స్టేషన్ల మధ్య పరుగులు

మోడీ-పెజెష్కియన్ భేటీలో ప్రత్యేక చర్చ

ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి కావడానికి ముందే భారత్-ఇరాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సమావేశంలో చబహార్ పోర్టు అభివృద్ధి , ప్రాంతీయ అనుసంధానానికి సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రైల్వే టికెట్లపై యూపీఐ ఛార్జీలు?- అక్టోబర్ 15 నుంచి కొొత్త రూల్..!
రైల్వే టికెట్లపై యూపీఐ ఛార్జీలు?- అక్టోబర్ 15 నుంచి కొొత్త రూల్..!

అమెరికా ఆంక్షల నడుమ భారత్ వ్యూహాత్మక అడుగులు

ఈ ప్రాజెక్టు విషయంలో అమెరికా ఆంక్షలు అడ్డంకిగా మారుతున్నప్పటికీ, భారత్ మాత్రం తన వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. గతంలో షాహిద్ బెహెష్తి టెర్మినల్ అభివృద్ధి కోసం ఇరాన్ సంస్థతో భారత్ పదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా ఆంక్షల సడలింపుల గడువు ముగిసినప్పటికీ, భవిష్యత్తులో ఆంక్షలు తొలగిపోతే మళ్లీ పూర్తి ఆపరేషనల్ హక్కులు భారత్‌కు దక్కేలా ఇరాన్ స్థానిక పోర్టు అధికారులతో ప్రత్యామ్నాయ ఒప్పందాలపై భారత్ చర్చలు జరుపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+