అర్ధరాత్రి ఇబ్బంది పెడుతున్నారు- పోలీసులకు అల్లు శిరీశ్ ఫిర్యాదు..!!
సినీ నటుడు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అర్ద్రరాత్రి పడుతున్న ఇబ్బందుల పైన చర్యలు తీసు కోవాలని కోరారు. గతంలోనే ఫిర్యాదు చేసినా.. పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. తనతో పాటుగా చాలా మంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారని తన ఫిర్యాదులో వివరించారు. అర్ద్రరాత్రి సమయం లో రెండు నుంచి మూడు గంటల వరకు ఈ సమస్య ఉంటుందని పేర్కొన్నారు. దీంతో, ఇప్పుడు అల్లు శిరీశ్ ఫిర్యాదుతో పోలీసులు చర్యలు మొదలు పెట్టారు.
సినీ నటుడు అల్లు శిరీష్ శబ్ద కాలుష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వినోభానగర్‌లోని ఓ ఆలయం నుంచి అర్ధరాత్రి వేళ కూడా పెద్ద శబ్దంతో సంగీతం వస్తుండటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని తన ఫిర్యాదులో వివరించారు. రోజువారీగా రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు మితిమీరిన శబ్ధంతో మైకులు మోగిస్తున్నారని ఆరోపించారు.

గతంలో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో తాను ఫిర్యాదు చేశానని ప్రస్తావించారు. అయితే, వినాయక నిమజ్జనం వరకు సర్థుకుపోవాలని తనకు పోలీసులు సూచించారని అల్లు శిరీశ్ అన్నారు. సెప్టెంబర్ 25వ తేదీతో గణేశ్ నిమజ్జనం పూర్తి అయినా ఇంకా ఆలయంలో మైకుల శబ్ధం తగ్గకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిద్రలేక స్థానిక వయోవృద్ధులు, చిన్న పిల్లలు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
అల్లు శిరీశ్ ఫిర్యాదుతో
Respected @hydcitypolice . I'm a resident of Aparna One, Shaikpet. For the last few days the Hanuman temple at Vinobha Nagar is playing loud music, beyond allowed decibels till night 2/3am. I complained the Film Nagar PS.
— Allu Sirish (@AlluSirish) September 27, 2026
They asked us to bear till 25th Sept as its Ganesh… pic.twitter.com/ggJp4U4hdU
గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసుల నుంచి సరైన స్పందన లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకొని చర్యలు తీసుకోవాలని అల్లు శిరీశ్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. కాగా.. నిమజ్జన కార్యక్రమం పూర్తయినా ఇంకా మైకుల శబ్దం కొనసాగటం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికంగా సమాచారం సేకరిస్తున్నారు. అల్లు శిరీష్ చేసిన ఫిర్యాదు పైన ఫోకస్ చేసిన పోలీసులు సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు.













Click it and Unblock the Notifications
