బెంగళూరు కోర్టులో విచిత్రం- జడ్జిమెంట్ కాపీలో కనిపించిన ఏఐ ప్రాంప్ట్స్
బెంగళూరు కోర్టుకు సంబంధించిన ఓ జడ్జిమెంట్ కాపీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ జడ్జిమెంట్ డాక్యుమెంట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినట్లు స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. ఎడిట్ చేయని ఓ ఏఐ కమాండ్, ప్రాంప్ట్ ఈ తీర్పు కాపీల్లో అలాగే ఉండిపోవడం దిగ్భ్రాంతిని కలిగించింది. నెటిజన్లు దాన్ని గుర్తించి స్క్రీన్‌షాట్‌లను సామాజిక మాధ్యమాలలో విరివిగా షేర్ చేస్తున్నారు.
ఇది న్యాయ వ్యవస్థలో ఏఐ సాంకేతికత వినియోగంపై వివాదం తలెత్తుతోంది. చర్చకు దారితీస్తోంది. న్యాయ ప్రక్రియలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఎంతమాత్రం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఘటన వెలుగులోకి రావడం పట్ల తీర్పులపై నెటిజన్లు సందేహాలు సైతం వ్యక్తం చేస్తోన్నారు. న్యాయస్థానాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అత్యంత ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందనే అంటున్నారు.

తీర్పు ముసాయిదాను సిద్ధం చేసే క్రమంలో కోర్టు వర్గాలు ఏఐ టూల్స్ సహాయం తీసుకున్నాయనేది ఇక్కడ స్పష్టమౌతోంది. ఆ డ్రాఫ్ట్ ఫైనల్ వెర్షన్‌ను అధికారికంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెనన్స్ ప్రాంప్ట్ ను తొలగించడం మర్చిపోయారని, అదే ఇప్పుడు ఈ దుమారానికి కారణమైందని చెబుతున్నారు. ఈ ఫైనల్ డ్రాఫ్ట్ స్క్రీన్ షాట్లు ఎక్స్ వంటి ప్లాట్ ఫామ్స్ పై చక్కర్లు కొడుతున్నాయి.
న్యాయ నిపుణులు, సాంకేతిక విశ్లేషకులు దీనిపై వేర్వేరుగా స్పందిస్తోన్నారు. కొందరు ఈ పొరపాటును కొట్టిపారేస్తోంటే, మరికొందరు కోర్టు డాక్యుమెంట్ల క్వాలిటీ కంట్రోల్, రివ్యూ ప్రక్రియను ప్రశ్నిస్తోన్నారు. అత్యంత బాధ్యతాయుతమైన కోర్టు ఉత్తర్వులను బహిరంగపరచడానికి ముందు కనీస తనిఖీలు కూడా జరగకపోవడం ఆందోళనకరమని అభిప్రాయపడుతున్నారు. ఈ క్లెరికల్ పొరపాటుగా అభివర్ణిస్తోన్నారు మరికొందరు.
BANGALORE DISTRICT COURT POSTED THE CHATGPT PROMPT IN THEIR JUDGMENT 😭😭 SON😭😭😭 https://t.co/llfuAyyRBz pic.twitter.com/W08jRToaVi
— Professor Mastikhor (@yappergodpromax) September 26, 2026
కోర్టు సిబ్బందిపై.. ప్రత్యేకించి తీర్పు ప్రతులను సిద్ధం చేసే జూనియర్ అసిస్టెంట్స్ పై కొందరు న్యాయవాదులు వేలెత్తి చూపుతున్నారు. పని ఒత్తిడి కారణంగానే ఇలాంటి మానవ తప్పిదాలు జరుగుతుంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. అధికారిక డాక్యుమెంట్లల్లో ఇటువంటి నిర్లక్ష్యాలు పరిపాలనాపరమైన విచారణలు, ఇతర శాఖాపరమైన ఇబ్బందులకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో దాఖలయ్యే లక్షలాది కేసుల భారాన్ని తగ్గించడానికి, డాక్యుమెంట్ల నిర్వహణ సులభతరం చేయడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడుతున్నారు చాలామంది. ఇప్పటికే కొన్ని న్యాయస్థానాలలో ప్రాంతీయ భాషా అనువాదాలు, పాత డాక్యుమెంట్ల పరిశీలన, కేసుల వర్గీకరణ కోసం ఏఐని ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. తుది తీర్పుల తయారీ, చట్టపరమైన ఉత్తర్వుల వంటి కీలక దశలలో వీటిని వినియోగించకూడదని అంటున్నారు.












Click it and Unblock the Notifications
