కాంగ్రెస్ కు మళ్లీ శశిథరూర్ తలనొప్పి ? మోడీ-రాహుల్ వార్ లో..!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) మరోసారి సొంత పార్టీకి షాకిచ్చారు. ప్రత్యర్థి పార్టీ నేత, ప్రధాని మోడీ విషయంలో గతంలో తన వ్యవహారశైలితో కాంగ్రెస్ ను ఇరుకునపెట్టిన థరూర్..ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేశారు. దీంతో బీజేపీ ఇప్పుడు ఇదే అదనుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తోంది. ఇంతకీ థరూర్ ఏం చేశారో, బీజేపీ రాహుల్ ను ఎందుకు టార్గెట్ చేస్తోందో ఇప్పుడు చూద్దాం..

ఇరాన్ వార్ నేర్పిన పాఠం..! మంగళూరులో కేంద్రం 15 వేల కోట్ల ప్రాజెక్ట్..!
ఇరాన్ వార్ నేర్పిన పాఠం..! మంగళూరులో కేంద్రం 15 వేల కోట్ల ప్రాజెక్ట్..!

ఇరాన్ వార్ నేపథ్యంలో భారతీయ నావికుల భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ జీ7 సదస్సులో చేసిన వ్యాఖ్యలకు థరూర్ తాజాగా మద్దతు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం సందర్భంగా ఈ అంశంపై ప్రధాని మౌనంగా ఉన్నారని ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తున్న సమయంలో ఇలా ఆయన మోడీకి మద్దతుగా నిలిచారు. ఇరాన్ వార్ లో నావికుల భద్రతకు సంబంధించి భారత్ ఆందోళనలను ప్రధాని మోదీ ట్రంప్‌కు చెప్పారని, యుద్ధ సమయంలో వాణిజ్య నౌకా సిబ్బంది లక్ష్యంగా మారకూడదని ఆయన గుర్తుచేశారని శశి థరూర్ పేర్కొన్నారు.

Shashi Tharoor Supports PM Modi on Trump Meeting BJP Slams Rahul Gandhi
Tamil Nadu: తమిళ ఎన్నికల్లో విదేశీయుల ఓట్లు ? రంగంలోకి ఈసీ, ఐబీ-ఎస్ఐఆర్ పైనా..!
Tamil Nadu: తమిళ ఎన్నికల్లో విదేశీయుల ఓట్లు ? రంగంలోకి ఈసీ, ఐబీ-ఎస్ఐఆర్ పైనా..!

మరోవైపు ఈ ఘటనపై స్వదేశంలో ఆగ్రహం పెరుగుతున్నప్పటికీ ప్రధాని ఈ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించడంలో విఫలమయ్యారని, ట్రంప్ నుంచి ఎందుకు క్షమాపణ గానీ, విచారం గానీ కోరలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో థరూర్ వ్యాఖ్యల్ని బీజేపీ అందిపుచ్చుకుంది. ప్రధానిపై శశిథరూర్ ప్రశంసలు రాహుల్ గాంధీ బండారం బయటపెట్టాయని పేర్కొంది.
కాంగ్రెస్ నాయకులు ప్రధాని @నరేంద్రమోదీజీ దౌత్యనీతిని బహిరంగంగా ప్రశంసిస్తున్నారని, జాతీయ ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రధాని మోదీకే మొదటి స్థానం అని తెలిపింది. భారతదేశ జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడే విషయంలో రాహుల్ గాంధీ అందరినీ వెనక్కి నెట్టేస్తారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+