హైదరాబాద్ లో ప్రేమోన్మాది.. వన్ సైడ్ లవ్ పేరుతో నలుగురిపై ఘాతుకం
ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో ఆ యువతిని ఇబ్బంది పెట్టాడు. ఆమె తన ప్రేమను తిరస్కరించిందని కక్ష పెంచుకున్నాడు. ఇంట్లోకి దూరి ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులపైనా కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో యువతి చేతికి తీవ్రంగా గాయం అయింది. సైబరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండ్ల బస్తీ ఊర పోచమ్మ ఆలయం దగ్గర ఈ దారుణమైన ఘటన జరిగింది.
నిందితుడు కంచమీది గోవర్ధన్ (22) గా పోలీసులు గుర్తించారు. గోవర్థన్.. యువతిపై దాడి చేస్తున్న క్రమంలో బాధితుల కేకలు విని ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని బంధించి పోలీసులకు అప్పగించారు స్థానికులు. గాయపడిన బాధితులందరూ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచమీది గోవర్ధన్.. ఎండ్ల కృతిక (20) అనే యువతిని ప్రేమ వేరుతో వేధించసాగాడు. వన్ సైడ్ లవ్ పేరుతో యువతిని వెంటపడి వేధించాడు. అయితే అతడి ప్రేమను కృతిక కాదనే సరికి ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేయాలని ప్లాన్ వేశాడు గోవర్థన్.

ఈ క్రమంలో బాధితురాలి ఇంటి రెండో అంతస్తులోకి నిందితుడు అక్రమంగా ప్రవేశించాడు. కత్తితో ఇంట్లోకి చొరబడ్డాడు. మొదట యువతి అక్క పూజిత గొంతుపై కత్తి పెట్టి బెదిరించాడు. కాపాడబోయిన కృతిక ఆమె తల్లిదండ్రులు, బాబాయ్ అర్జున్ లపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో దాడిలో యువతి తల్లి ముఖం, చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుల కేకలు విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని బంధించి పోలీసులకు అప్పగించారు. నిందితుడు కంచమీది గోవర్ధన్ ను అదుపులోకి తీసుకుని, హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications