కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం .. తెలంగాణలో కేసీఆర్ కు జైలు ఖాయం .. ఎమ్మెల్యే కోమటిరెడ్డి జోస్యం

Recommended Video

    తెలంగాణలో KCR కు జైలు ఖాయం : కోమటిరెడ్డి || Oneindia Telugu

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు చేశారు . దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో ఈ దఫా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్ .

    కేసీఆర్ కుటుంబ అవినీతి బయట పెడతాం ... కేసీఆర్ ను జైలుకు పంపిస్తాం అన్న కోమటిరెడ్డి బ్రదర్

    కేసీఆర్ కుటుంబ అవినీతి బయట పెడతాం ... కేసీఆర్ ను జైలుకు పంపిస్తాం అన్న కోమటిరెడ్డి బ్రదర్

    కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అవినీతిని, వారి కుటుంబ పాలకుల దోపిడిని బయటకు లాగుతామని ఆయన టీఆర్ఎస్ సర్కార్ ను హెచ్చరించారు . కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు . మొన్నటికి మొన్న పెద్దమ్మకు మొక్కుకున్నా కేసీఆర్ పాలన అంతం కావాలని అని కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కోమటి రెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులు ఉసురు తగిలి నాశనం అవుతారని శాపనార్ధాలు పెట్టారు. ఇక తాజాగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏకంగా సీఎం కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

    రానున్న ఆరునెలల్లో టీఆర్ఎస్ పార్టీ నశించిపోవటం ఖాయం అన్న కోమటిరెడ్డి

    రానున్న ఆరునెలల్లో టీఆర్ఎస్ పార్టీ నశించిపోవటం ఖాయం అన్న కోమటిరెడ్డి

    రాష్ట్ర ఖజానాను కుటుంబమంతా కలిసి దోచుకుతిని ఇప్పుడు ఖాళీ చేసి వదిలేశారని మండిపడ్డారు . అందుకే అది కప్పి పుచ్చుకోడానికి గెలిచి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు మంత్రివర్గాన్ని కూడా భర్తీ చేయలేకపోతున్నారని ఆరోపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . అంతేకాదు తెలంగాణలో రానున్న ఆరు నెలలలో టీఆర్ఎస్ పార్టీ నశించి పోవడం ఖాయమని తేల్చి చెప్పారు.ఇంటర్ విద్యార్థుల మరణాలపై అసలు స్పందించలేని పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉందని చెప్పుకొచ్చారు.

    కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం రాష్ట్రంలో కేసీఆర్ జైలుకు వెళ్ళటం ఖాయం

    కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం రాష్ట్రంలో కేసీఆర్ జైలుకు వెళ్ళటం ఖాయం

    తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే లోక్‌సభ ఎన్నికలలో కూడా కనిపించబోతున్నాయని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అత్యధిక ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచుకుంటుందని రాజగోపాల్ రెడ్ది అన్నారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. ఇక దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం, రాష్ట్రంలో కేసీఆర్ జైలుకు వెళ్ళటం ఖాయం అని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+