Congress: ఆదివారమే కాంగ్రెస్ తొలి జాబితా.. ఎంత మంది అంటే..!
నవంబర్ 3న తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండండతో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రెండు విడతలుగా జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితాలో 54 మంది పేర్లు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణతో పాటు రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆదివారం 54 మంది తొలి జాబితా..ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో మిగతా స్థానాల జాబితాను ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం సీపీఎం, సీపీఐతో పొత్తులపై చర్చలు తుది దశలో ఉన్నాయని.. ఈ పొత్తులపై అక్టోబర్ 15వ తేదీ కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయులుగా ఉన్న వారినే అభ్యర్థులుగా ఎంపిక చేశామని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు మురళీధరన్ చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

119 స్థానాల్లో మెజారిటీ పార్టీ నేతలకు సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లడం అనేది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. మరోవైరు కొందరు నేతలు టికెట్ కన్ఫామని ప్రచారంలోకి దిగిపోయారు. ఈసారి కాంగ్రెస్ ఛాన్స్ ఉంటుందని మెజారిటీ సర్వేలు చెబుతుండడంతో ఆ పార్టీ నేతుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటి వరకు పార్టీ వదిలి వెళ్లిన వారు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించి ప్రచారం దూసుకెళ్తోంది. ఆదివారం నుంచి సీఎం కేసీఆర్ ప్రచారం ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. మరో వైపు బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. త్వరలో బీజేపీ జాబితా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీఎస్పీ తొలి జాబితా విడుదల చేసింది.












Click it and Unblock the Notifications