తెలంగాణాలో కాంగ్రెస్ దే విజయం; ఇండియా కూటమికే అక్కడ అధికారం!!
తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల నగారా మ్రోగింది. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లోనూ భారత కూటమి విజయం సాధిస్తుందని శివసేన( యు బి టి) ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తుందని సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి పది సీట్లు కూడా రావని పేర్కొన్న ఆయన, ఐదు రాష్ట్రాలలోనూ ఇండియా కూటమి గెలుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో మూడింటిలో ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, ఈసారి మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని సంజయ్ రౌత్ తెలిపారు.

ఇదే సమయంలో గత రెండు సంవత్సరాలుగా మహారాష్ట్రలోని ముంబై మహా నగరపాలిక ఎన్నికల తేదీలను ప్రకటించకపోవడంపై సంజయ్ రౌత్ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాలకు తేదీలను ప్రకటిస్తున్నారు కానీ ముంబై మహానగరపాలక సంస్థ కోసం ఎదురు చూస్తోందని, ముంబై తో పాటు మహారాష్ట్రలో 14 మహానగర పాలికలకు ఎన్నికలను జరపాల్సి ఉందని కానీ, ఎన్నికలు నిర్వహించకుండా అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఇజ్రాయిల్- పాలస్తీనా లాంటి గ్లోబల్ విషయాల్లో దేశం తగిన పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయిల్ హమాస్ వివాదంపై మాట్లాడిన సంజయ్ రౌత్ దేశం చరిత్రను మర్చిపోకూడదని ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లడం పై మాట్లాడిన సంజయ్ రౌత్ ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవిస్ సామర్థ్యం పెరిగిందని, ఆయనకు ఇప్పుడు ఢిల్లీలో పని ఉందని షిండే గ్రూప్ నమ్ముతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయిల్ పాలస్తీనా సమస్య, మణిపూర్ హింస, కాశ్మీరీ పండిట్ల సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలను పరిష్కరించడంలో అమిత్ షా, నరేంద్ర మోడీ విఫలమయ్యారు అని పేర్కొన్న ఆయన, అందుకే దేవేంద్ర ఫడ్నవీస్ ను పిలుస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇక జరగనున్న ఎన్నికలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications