టీఆర్ఎస్‌కు షాక్: రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్ధులదే విజయం
హైదరాబాద్: గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి ఏడాది గడిచే సరికే టీఆర్ఎస్‌కు పెద్ద షాక్ తగిలింది.
కరీంనగర్ జిల్లాలోని రెండు సింగిల్ విండోలకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు చోట్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. జిల్లాలోని హుస్నాబాద్, ముల్కనూరు సింగిల్ విండోలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి.

హుస్నాబాద్ సింగిల్ విండో ఛైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ నేత బొలిశెట్టి శివయ్య విజయం సాధించగా, ముల్కనూరు సింగిల్ విండోలో ఐదు డైరెక్టర్ స్ధానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ప్యానెల్ విజయం సాధించింది.












Click it and Unblock the Notifications