Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్రాంతి పండుగకు సామాన్యులకు వంటనూనెల ధరల షాక్!

వంట నూనె ధరలు మండిపోతున్నాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలకు పండుగ పూట ఇబ్బంది పెడుతున్నాయి. విపరీతంగా పెరిగిన వంట నూనె ధరలతో సంక్రాంతి పండుగకు ఏం వండుకోవాలి అన్నట్టు సామాన్య మధ్య తరగతి ప్రజలు సందిగ్ధంలో పడుతున్నారు. ఒకపక్క క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి పండుగలు వరుస పెట్టి వస్తున్న వేళ వంట నూనెల ధరలు కూడా పై పైకి ఎగసిపడడం ప్రధానంగా కనిపిస్తుంది.

బాగా పెరిగిన వంట నూనె ధరలు
అయిదారు నెలల క్రిందట 100 రూపాయలకు దిగువన ఉన్న పామాయిల్ రేటు ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. తాజాగా పామాయిల్ ధర ఇప్పుడు 150 రూపాయలకు పైగా చేరింది. ఇక పండుగ సీజన్ ముందు నూనె వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అదనంగా ఖర్చు కూడా భరించవలసి వస్తుంది. వంట నూనెల పై రెండు నెలలవీధిలో లీటర్ కు కనిష్టంగా 20 రూపాయల ధర పెరిగింది.

Cooking oil prices shock the common man for the Sankranthi festival

ధరలు పెరగటంతో సామాన్యులపై భారం
దీంతో నెలకు 9 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రతి జిల్లాలోని ప్రజలు మోయాల్సి వస్తుంది. ఈ నెలలోనే పొద్దుతిరుగుడు నూనె, పామాయిల్ లీటర్ కు సగటున 20 రూపాయలు ధర పెరిగింది. ఇక వేరుసెనగ నూనె ధర 170 నుంచి 175 రూపాయల మధ్య కొనసాగుతుంది. అయితే దీని ధరలో పెద్దగా హెచ్చుతగ్గులు లేకపోవడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ధరలను తగ్గించేందుకు ప్రభుత్వ చొరవ
ప్రస్తుతం పండుగ సీజన్లో నూనెల ధరలు పెరగడం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అశనిపాతంగా మారింది. మరోవైపు దుకాణం దారులు ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధరల నియంత్రణకు చొరవ చూపాలని, లేదంటే తక్కువ ధరకు నూనె అందించేలా ప్రత్యేక కేంద్రాలను, రేషన్ షాపుల్లో నూనె ఇచ్చేలా ఏర్పాటును చేయాలని కోరుతున్నారు.

పండుగల వేళ ప్రభుత్వం స్పందిస్తుందా?
కూలి పనులు చేసుకుని జీవనం సాగించే వారికి ధరల బాదుడును తగ్గించడానికి ప్రభుత్వం చొరవ చూపితేనే పండుగలు చేసుకోగలుగుతామని వారు చెబుతున్నారు. మరి వంటనూనె ధరలు నియంత్రణకు ప్రభుత్వాలు ఎటువంటి చొరవ తీసుకుంటాయనేది వేచి చూడాల్సిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+