దేశంలోనే తొలిగా.. వేసవిలో చల్లచల్లగా.. తెలంగాణాలో కూల్ రూఫ్ పాలసీ; ఆవిష్కరించిన కేటీఆర్!!
వేసవి విపరీతంగా పెరిగిపోతుంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలలో కరెంటు వాడకం కూడా విపరీతంగా పెరిగింది. ఈ ప్రభావం నుండి తప్పించుకోవడానికి, కరెంటు వాడకాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే కూల్ రూఫ్ పాలసీని ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలవబోతోంది.
తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ 2023-28 ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో కూల్ రూఫ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని సిడిఎంఏ ఆఫీసులో భవన యజమానులు ఎండ వేడిమిని తగ్గించుకోవడం కోసం సహజ విధానాలను పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ 2023-28 ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీని తీసుకువచ్చినట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పిన ఆయన మొదట తమ ఇంటిపై కూల్ రూఫ్ విధానాన్ని అమలు చేశామని, అది మంచి ప్రయోజనాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

600 చదరపు గజాలు అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు కూల్ రూఫ్ మస్ట్
దేశం మొత్తం లోనే హైదరాబాద్లో ఆఫీసు స్పేస్ కు డిమాండ్ ఉందని పేర్కొన్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో ఉన్న అవకాశాలు దేశంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హరితహారం కార్యక్రమంలో భాగంగా 240 కోట్ల మొక్కలను నాటి వాటిని పరిరక్షిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని వెల్లడించిన కేటీఆర్ 600 చదరపు గజాలు అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు కూల్ రూఫ్ తప్పనిసరి చేయనున్నామని పేర్కొన్నారు.
2030 నాటికి రాష్ట్రంలో కూల్ రూఫ్ లక్ష్యం ఇదే
ఏడాదిలో హైదరాబాద్లో ఐదు చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్ అమలు చేస్తామని, డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు అన్నింటికీ కూల్ రూఫ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. 2030 నాటికి రాష్ట్రంలో 200 చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్ ను ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య భవనాలలో కూడా కూల్ రూఫ్ అమలు చేస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్.
With a vision to make Telangana a more thermally comfortable, a heat resilient state, #TrailblazerTelangana Govt takes an innovative step.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 3, 2023
MA&UD Minister @KTRBRS launched ‘Telangana Cool Roof Policy 2023-28’ to reduce urban heat island impact☀️ & heat stress🌡️ pic.twitter.com/aeEukEOv2c
కూల్ రూఫ్ విధానంతో కరెంట్ వాడకం తగ్గుతుందన్న కేటీఆర్
కూల్ రూఫ్ ఏర్పాటు చేయడం వల్ల మీటర్ కు 300 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని వెల్లడించారు . కూల్ రూఫ్ వల్ల కరెంటు వాడకం తగ్గి బిల్లు కూడా తక్కువ వస్తుందని కూల్ రూఫ్ కోసం ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం తరఫున శిక్షణ ఇస్తామని కేటీఆర్ వెల్లడించారు. భవన నిర్మాణ వ్యర్ధాలను సేకరించి కూల్ రూఫ్ కు ఉపయోగిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications