ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్డన్‌సెర్చ్: 50మంది అరెస్ట్, ఇల్లు కూలి ముగ్గురు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ చిలుకానగర్‌లో పోలీసులు బుధవారం రాత్రి కార్డన్‌సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టారు. నాలుగు వందల మంది పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంట్లో గాలింపు చర్యలు చేపట్టారు. మల్కాజ్‌గిరి డీసీపీ రమారాజేశ్వరి నేతృత్వంలో తనిఖీలు బుధవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కొనసాగించారు.

ఈ తనిఖీల్లో పోలీసులు 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 13 మంది పాతనేరస్థులుగా గుర్తింపు. అనుమానితుల్లో ఎక్కువమంది ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. అదేవిధంగా ఆధారాలు లేని 40 టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను, 9 గ్యాస్ సిలిండర్లతోపాటు గ్యాస్ కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు.

cordon search operation held by police in hyderabad

ఇల్లు కూలి తల్లి సహా ఇద్దరు చిన్నారులు మృతి

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని మేదరబస్తీలో అర్థరాత్రి విషాదం చోటుచేసుకుంది. పాత పెంకుటిల్లు కూలిన ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లితో పాటు ఇద్దరు పిల్లలు మృతిచెందారు.

మృతులు సుధారాణి(35), భార్గవి(9), కీర్తన(8)గా గుర్తింపు. ఈ ప్రమాదంలో భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు సహాయకచర్యలను చేపట్టి శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు.

English summary
Cordon search operation held by police in hyderabad, 50 suspect arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X