Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా బడ్జెట్ సమావేశాలపై కరోనా ఎఫెక్ట్ : అసెంబ్లీలో కరచాలనాలు లేవు అన్నీ నమస్కారాలే

చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభం అయిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన తన ప్రభావాన్ని చూపిస్తుంది. తెలంగాణా బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, రాసుకుని పూసుకుని తిరిగిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నమస్కారమే సంస్కారం అంటూ చేతులు జోడించి మరీ నమస్కారాలు పెడుతున్నారు.

ప్రారంభమైన తెలంగాణా బడ్జెట్ సమావేశాలు..కరోనా భయంలో ఎమ్మెల్యేలు

ప్రారంభమైన తెలంగాణా బడ్జెట్ సమావేశాలు..కరోనా భయంలో ఎమ్మెల్యేలు

నిన్నటి దాకా మనకు ఎఫెక్ట్ లేదులే అనుకున్న కరోనా తెలంగాణా రాష్ట్రంలో కూడా తన ఉనికి ఉందని చెప్పింది. ఇప్పటికి ఒక కేసు నమోదైంది. ఇక అప్పటి నుండి హైదరాబాద్ వాసులే కాదు , ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు సైతం భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇదే సమయంలో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దీంతో ఎమ్మెల్యేల బాధ అంతా ఇంతా కాదు. కరోనా వైరస్ ఎక్కడ ఎవరి ద్వారా అంటుకుంటుందో అని తెగ బాధ పడుతున్నారు.

అసెంబ్లీ లాబీలో అందరికి ఆహ్వానం పలుకుతూ నమస్కారం పెట్టిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి

అసెంబ్లీ లాబీలో అందరికి ఆహ్వానం పలుకుతూ నమస్కారం పెట్టిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి

ఇక నేడు బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు అసెంబ్లీ లాబీలో చోటు చేసుకున్న సన్నివేశాలు మన నేతల కరోనా భయాన్ని ఇట్టే చెప్తున్నాయి. తెలంగాణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో నిలబడి ఎమ్మెల్యేలకు స్వాగతం పలుకుతున్న సమయంలో ఎమ్మెల్యేలు సహజంగా షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇది ఎప్పటినుండో అలవాటైన విధానం . అయితే కరోనా ప్రభావంతో ఓ ఎమ్మెల్యే షాకే హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకు రాగా బాజిరెడ్డి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం చేశాడు.

Recommended Video

    3 Minutes 10 Headlines | COVID-19 Outbreak In India & Telugu States | Yes Bank Withdrawal Limit
    కరచాలనాలు లేవు .. కేవలం నమస్కారాలతో ఆసక్తికర సన్నివేశం

    కరచాలనాలు లేవు .. కేవలం నమస్కారాలతో ఆసక్తికర సన్నివేశం

    మొదట షాకైన ఎమ్మెల్యేలు ఆ వెంటనే అసలు విషయం తెలుసుకొని వారు కూడా నవ్వుతూ నమస్కారం చేసి లోపలికి వెళ్లారు.కరోనా తెలుగు రాష్ట్రాల్లో లేదని, విదేశాల నుంచి వచ్చిన ఒక వ్యక్తికి మాత్రమే సోకినట్టుగా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా పై వస్తున్న వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అయినా ఎమ్మెల్యేలలో సైతం కరోనా భయం ఉందని కరచాలనం చెయ్యకుండా నమస్కారం పెట్టటం ద్వారా తెలియజేశారు. ఏది ఏమైనా తెలంగాణా బడ్జెట్ సమావేశాలలో కరోనా వైరస్ తాను ఉన్నానని ఆలోచించేలా చేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+