షాకింగ్: తెలంగాణలో కరోనా లోకల్ వ్యాప్తి.. రాబోయే నెల రోజులు డేంజరన్న ఆరోగ్య శాఖ..
ఇప్పటికే కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుండగా, తెలంగాణలో వైరస్ వ్యాప్తికి సంబంధించి ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి స్టేజ్ 3కి దగ్గరగా ఉందని, జాగ్రత్తలు పాటించకుంటే సామూహిక వ్యాప్తి తలెత్తే ప్రమాదముందని, ప్రస్తుతానికి వైరస్ లోకల్ వ్యాప్తి విస్తృతంగా ఉందని జాగ్రత్తలు పాటించకపోతే తర్వాతి దశ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషనే అని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీనివాస రావు గురువారం మీడియాకు తెలిపారు.

రాబోయేవి డేంజర్ డేస్..
లోకల్ గా వైరస్ వ్యాప్తి విస్తృతంగా కొనసాగుతోందన్న ఆరోగ్య శాఖ అధికారి.. రోగుల కాంటాక్టులను ట్రేస్ చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయని, వైరస్ ఎటు నుంచి ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉన్న హైదరాబాద్ సిటీలో కొద్ది రోజులుగా కొత్త కేసుల నమోదు తగ్గినప్పటికీ, రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, రాబోయే నాలుగైదు వారాలు చాలా ప్రమాదకరమని, ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

జ్వరం వచ్చిన అందరికీ టెస్టులు..
తెలంగాణలో వైరస్ ఉధృతి కమ్యూనిటీ వ్యాప్తి దశకు దగ్గరగా వచ్చిన తరుణంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, జ్వరం గానీ కరోనా ఇతర లక్షణాలున్న ప్రతి ఒక్కరూ ఆలస్యం చేయకుండా టెస్టులు చేయించుకోవాని, ఇందు కోసం అన్ని జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీల్లో) పరీక్షలు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కరోనా లక్షణాలున్నవారు టెస్టులు, చికిత్స విషయంలో ఆలస్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. మరోవైపు, పీహెచ్‌సీల్లో టెస్లుల నిర్వహణతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే పూర్తి స్థాయి కరోనా ఆస్పత్రులుగా మారిన గాంధీ, ఫివర్, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో కొవిడ్ సంబంధిత అన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

50వేల మార్కు..
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య బుధవారం నాటికే 50వేల మార్కుకు చేరువైంది. నిన్న ఒక్కరోజే 1281 కొత్త కేసులు, తొమ్మిది మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 76.5 శాతంకాగా, డెత్ రేటు మాత్రం 1శాతంలోపే(0.88 శాతం) ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటిదాకా ఆర్టీపీసీ విధానంలో చేపట్టిన టెస్టులు వల్ల రోగుల గుర్తింపు ఆలస్యమై, వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో.. ఇకపై యాంటీజెన్ టెస్టులను విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Recommended Video

అయినాసరే.. తెలంగాణ బెటరే..
‘‘కరోనా వైరస్ సోకినంత మాత్రాన కంగారు పడొద్దు. తక్కువ మందులతోనే వ్యాధి నయమైపోతుంది. కరోనా ట్రీట్‌మెంట్‌కు లక్షల రూపాయల వైద్యం అవసరం లేదు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. వైద్య శాఖలో ఖాళీ భర్తీని కూడా చేపట్టింది. లోకల్ ట్రాన్స్ మిషన్ దశలో ఉన్నప్పటికీ దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయి. వైరస్ బారినపడ్డవాళ్లలో 99 శాతానికిపైగా రికవరీ అవుతున్నారు. మొత్తం కేసుల్లో 70 శాతం మంది రోగులు హోం ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని నా మనవి'' అని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివరించారు.












Click it and Unblock the Notifications