కరోనాపై యుద్ధానికి రెడీ: కేసీఆర్, 20 తర్వాత కేంద్ర మార్గదర్శకాలు, 650 కరోనా కేసులు, 18 మరణాలు
హైదరాబాద్: కరోనాపై యుద్ధానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎంత మంది కరోనా బాధితులకైన చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పస్టం చేశారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ్య మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పీపీఈలు, మాస్కుల కొరత లేదు.. సిద్ధంగా ఉన్నాం..
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనావైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్ కిట్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో పీపీఈ కిట్లకు ఏ మాత్రం కొరత లేదని చెప్పారు. ఇప్పటికే 2.25 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయని, ఈ సంఖ్య మరి కొద్ది రోజుల్లో 5 లక్షలకు చేరుకుంటుందని తెలిపారు. మరో 5 లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్95 మాస్కులున్నాయని, త్వరలో ఈ సంఖ్య 5 లక్షలకు చేరుకుంటుందన్నారు. మరో 5లక్షల ఎన్95 మాస్కులకు ఆర్డర్ ఇచ్చినట్లు
సీఎం కేసీఆర్ తెలిపారు. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, డాక్టర్లు, ఇతర సిబ్బంది, ఆస్పత్రులు, బెడ్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే 20 వేల బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని, లక్ష మంది పేషెంట్లకు చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు.

20 తర్వాత కేంద్రం మార్గదర్శకాలు..
ఏప్రిల్ 20 వరకు లాక్‌డౌన్ యథావిధంగా కొనసాగుతుందని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు కొనసాగనున్నట్లు తెలిపారు.
పేదలకు, వసల కూలీలకు సాయంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. లాక్‌డౌన్‌కు ప్రజల సహకారం కొనసాగాలని అన్నారు. ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

తెలంగాణలో 650కి పాజిటివ్ కేసులు..
కాగా, తెలంగాణ రాష్ట్రంలో బుధవారం మరో ఆరు కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 650కు చేరుకుంది.
8 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 118కి చేరింది.
ఇప్పటి వరకు 514 మంది యాక్టివ్ కేసులుగా ఉన్నారు. రాష్ట్రంలో 18 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి.
Recommended Video
-
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications