జానీ మాస్టర్ కు షాకిచ్చిన కోర్టు.. రిమాండ్, చంచల్ గూడా జైలుకు!
తన వద్ద అసిస్టెంట్ గా పని చేసిన కొరియోగ్రాఫర్ పైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం చేశారన్న వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక జానీ మాస్టర్ పై నమోదైన అత్యాచారం కేసులో ప్రస్తుతం కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు పోలీసులు జానీ మాస్టర్ ని కోర్టు ముందు హాజరు పరచగా న్యాయస్థానం ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది.
కోర్టు ముందు జానీ మాస్టర్ ను హారుపరిచిన పోలీసులు
జానీ మాస్టర్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గోవాలో ఉన్న జానీ మాస్టర్ ను అరెస్టు చేసి తీసుకువచ్చి రహస్యంగా విచారించిన పోలీసులు ఈ రోజు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనను అనంతరం రాజేంద్రనగర్ సిసిఎస్ కు తరలించారు. అక్కడి నుండి ఉప్పరపల్లి కోర్టుకు తీసుకువెళ్లి జానీ మాస్టర్ ను జడ్జి ముందు ప్రవేశపెట్టారు.

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడి
తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన 21 ఏళ్ళ యువతి పైన జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్టు అలాగే మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని ఆమెను బెదిరించినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన పైన రేప్ కేసు నమోదయింది. లవ్ జీహాద్ అని పెద్ద రచ్చ జరిగింది. ఇక తనపైన కేసు నమోదు కావడంతో పరారైన జానీ మాస్టర్ బెంగళూరు నుండి గోవా వెళ్లారు.
జానీ మాస్టర్ పై జీరో ఎఫ్ఐఆర్, పోక్సో చట్టం క్రింద కేసు
జానీ మాస్టర్ పైన జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు, పోక్సో చట్టం కింద కూడా మరో కేసు నమోదు చేశారు. ఆయనను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసులు ఫైనల్ గా భార్య సహాయంతో జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్టు ట్రాక్ చేసి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పిటి వారెంట్ తీసుకొని హైదరాబాద్ కు తీసుకువచ్చారు.
నేడు కోర్టులో హాజరు.. 14 రోజులు రిమాండ్ , చంచల్ గూడా జైలుకు జానీ మాస్టర్
ఇక తాజాగా జానీ మాస్టర్ ను నేడు ఉప్పరపల్లి కోర్టు ముందు హాజరు పరచగా, జానీ మాస్టర్ కు కోర్టు ధర్మాసనం 14రోజులు రిమాండ్ విధిస్తున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో మరికాసేపట్లో పోలీసులు ఆయనను చంచల్గూడా జైలుకు తరలించనున్నారని సమాచారం.. మరోవైపు జానీ మాస్టర్ పైన పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదుకావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ వేయనున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications